News October 8, 2025

నిండు చంద్రుడిని బంధించిన ఎండపల్లి యువకుడు

image

ఎండపల్లికి చెందిన మల్లేష్ తన మొబైల్‌తో నిండు పౌర్ణమి రాత్రి ఆకాశంలో మెరిసిన చంద్రుడిని అద్భుతంగా క్యాప్చర్ చేశాడు. చంద్రుడి ఉపరితలం స్పష్టంగా కనిపించేలా తీసిన ఈ అరుదైన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. “మొబైల్‌తో ఇంత క్లారిటీనా!” అంటూ స్థానికులు, నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మల్లేష్ ఫోటోగ్రఫీ ప్రతిభకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Similar News

News October 8, 2025

NZB: హుసాముద్దీన్‌కు గోల్డ్ మెడల్

image

బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కప్ ఛాంపియన్షిప్‌లో నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన మహమ్మద్ హుసాముద్దీన్ గోల్డ్ మెడల్ సాధించాడు. ఇంటర్నేషనల్ బాక్సర్, అర్జున అవార్డు గ్రహీత మహమ్మద్ హుసాముద్దీన్ తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో జరిగిన BFI కప్ ఛాంపియన్షిప్‌లో 55 – 60 కేజీల వ్యక్తిగత శరీర బరువు కేటగిరిలో పోటీపడ్డాడు. వరుస విజయాలతో దూసుకెళ్లిన హుసాముద్దీన్ గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నాడు.

News October 8, 2025

TGSRTCలో జాబ్స్.. నేటి నుంచి దరఖాస్తులు

image

TGSRTCలో 1,743 ఉద్యోగాల భర్తీకి నేడు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 28 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇందులో 1,000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులు ఉన్నాయి. డ్రైవర్ పోస్టులకు 22-35 ఏళ్లు, శ్రామిక్ ఉద్యోగాలకు 18-30 ఏళ్ల వయసున్న వారు అర్హులు. SC, ST, BC, EWS కేటగిరీ అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు ఉంది. పూర్తి వివరాలకు, దరఖాస్తు చేసేందుకు <>https://www.tgprb.in/<<>> వెబ్‌సైట్‌‌కు వెళ్లండి.

News October 8, 2025

ఆదిలాబాద్: నామినేషన్‌లు వేయాల్సింది అక్కడే..!

image

ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ఆయా మండలాల మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయాలలో, జడ్పీటీసీ సభ్యుల నామినేషన్ల స్వీకరణ మండల పరిషత్ కార్యాలయంలో స్వీకరించనున్నట్లు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, ఉపసంహరణ ప్రక్రియలను మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహిస్తూ సమయపాలన పక్కాగా పాటించాలన్నారు. అభ్యర్థి సహా ముగ్గురిని మాత్రమే లోనికి అనుమతించాలని సూచించారు.