News October 8, 2025
విషం తాగి ఆత్మహత్యాయత్నం.. ప్రాణాలు కాపాడిన పోలీస్

తంగళ్ళపల్లిలో మహేష్ అనే యువకుడు విషం తాగి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా పోలీసు సమయస్ఫూర్తితో ప్రాణాలు దక్కాయి. విషం తాగానని తల్లికి ఫోన్ చేసి చెప్పడంతో తల్లి వెంటనే డయల్ 100కు సమాచారం ఇచ్చారు. వెంటనే బ్లూ కోట్స్ కానిస్టేబుల్ ప్రశాంత్ మహేష్ ఫోన్ నంబర్‌ను ట్రేస్ చేశారు. అతడిని ఆసుపత్రికి తరలించగా ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు నిర్ధారించారు. కానిస్టేబుల్ ప్రశాంత్‌ను పలువురు అభినందించారు.
Similar News
News October 8, 2025
సంగారెడ్డి: సదరం శిబిరం షెడ్యూలు విడుదల

దివ్యాంగుల కోసం అక్టోబర్ నెలకు సంబంధించిన సదరం షెడ్యూలు విడుదలైనట్లు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండ్ డాక్టర్ మురళీకృష్ణ మంగళవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ ..ఈనెల 14, 16, 18, 21, 23, 25, 28, 30 తేదీల్లో సదరం శిబిరాలు జరుగుతాయని చెప్పారు. దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News October 8, 2025
2050 నాటికి అతిపెద్ద చమురు వినియోగదారుగా భారత్: బ్రిటన్ ఎకనామిస్ట్

చమురు వినియోగంలో 2050 నాటికి భారత్ అన్ని దేశాలను అధిగమిస్తుందని బ్రిటిష్ ఎకనామిస్ట్ స్పెన్సర్ డేల్ అంచనా వేశారు. ఇది ప్రపంచ ఇంధన వినియోగంలో 12%కి పైగా ఉంటుందన్నారు. ప్రస్తుతం ఇండియన్ ఆయిల్ డిమాండ్ రోజుకు 5.4M బారెల్స్‌గా ఉండగా, 2050 నాటికి ఇది 9.1M bpdకి చేరుతుందన్నారు. అలాగే నేచురల్ గ్యాస్ వినియోగం రెట్టింపవుతుందన్నారు. కాగా ప్రస్తుతం IND మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారుగా, వినియోగదారుగా ఉంది.
News October 8, 2025
NZB: హుసాముద్దీన్‌కు గోల్డ్ మెడల్

బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కప్ ఛాంపియన్షిప్‌లో నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన మహమ్మద్ హుసాముద్దీన్ గోల్డ్ మెడల్ సాధించాడు. ఇంటర్నేషనల్ బాక్సర్, అర్జున అవార్డు గ్రహీత మహమ్మద్ హుసాముద్దీన్ తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో జరిగిన BFI కప్ ఛాంపియన్షిప్‌లో 55 – 60 కేజీల వ్యక్తిగత శరీర బరువు కేటగిరిలో పోటీపడ్డాడు. వరుస విజయాలతో దూసుకెళ్లిన హుసాముద్దీన్ గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నాడు.