News October 8, 2025
మోహన్‌బాబు యూనివర్సిటీకి భారీ జరిమానా

AP: సినీ నటుడు మోహన్‌బాబుకు ఉన్నత విద్యా కమిషన్ షాకిచ్చింది. తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీలో మూడేళ్లుగా విద్యార్థుల నుంచి అదనంగా రూ.26 కోట్లు వసూలు చేసినట్లు వెల్లడించింది. 15 రోజుల్లోగా ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఆదేశించింది. విచారణ అనంతరం రూ.15 లక్షల జరిమానా విధించింది. యూనివర్సిటీ లైసెన్స్ రద్దు చేయాలని ప్రభుత్వానికి కమిషన్ సిఫారసు చేసింది.
Similar News
News March 8, 2026
ట్రంప్‌ను వదిలేది లేదు.. ప్రతీకారం తీర్చుకుంటాం: ఇరాన్

అయతుల్లా ఖమేనీ మృతికి ట్రంప్ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజాని హెచ్చరించారు. తమ నాయకుడు చిందించిన రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటామని Xలో స్పష్టం చేశారు. ‘ఇరాన్‌కు వ్యతిరేకంగా తమ భూభాగాలను US ఉపయోగించుకోకుండా మిడిల్ ఈస్ట్ దేశాలు నిరోధించాలి. ఆ ప్రాంతాల నుంచి దాడి జరిగితే మేం ప్రతిస్పందిస్తాం’ అని తేల్చిచెప్పారు. IRGC కొందరు అమెరికన్ సైనికులను బంధించిందని పేర్కొన్నారు.
News March 8, 2026
కోచ్‌గా గంభీర్.. విమర్శకుల నోళ్లు మూయిస్తారా?

టీమ్ ఇండియా కోచ్‌గా ప్రశంసల కంటే <<18976802>>విమర్శలనే<<>> గంభీర్ ఎక్కువ ఎదుర్కొన్నారు. తన వ్యూహాలు, ఎంపికలపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఒక్క మ్యాచ్ ఓడినా, అతడు సపోర్ట్ చేసిన ప్లేయర్ రాణించకున్నా విమర్శకుల దండయాత్ర జరిగేది. కానీ వాటిని దాటుకుని, INDను T20 WC ఫైనల్‌కు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. కెప్టెన్ సూర్యకు అవసరమైన సలహాలిస్తూ నడిపించారు. మరి ఇంకో గెలుపుతో విమర్శకుల నోళ్లు మూయిస్తారా? కామెంట్ చేయండి.
News March 8, 2026
విద్యార్థులకు సూపర్ న్యూస్

TG: వచ్చే విద్యా సంవత్సరం నుంచి స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌ను ప్రభుత్వం అమలు చేయనుంది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. దీంతో 21 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. అలాగే ప్రస్తుతం పాఠశాల విద్యార్థులకు వారంలో 3 రోజులు రాగి జావ ఇస్తున్నారు. మిగిలిన 3 రోజులు పాలను అందించాలని అధికారులు నిర్ణయించారు. కాలేజీ స్టూడెంట్లకూ పాలు, రాగి జావ ఇవ్వాలని ఇంటర్ విద్యాశాఖ కోరుతోంది.


