News October 8, 2025
నిర్మల్: నేడే కీలక తీర్పు.. జిల్లాలో ఉత్కంఠ

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన కీలకమైన కోర్టు తీర్పు నేడు వెలువడనుంది. దీంతో నిర్మల్ జిల్లాలో ఉత్కంఠ నెలకొంది. ఈ తీర్పు జిల్లాలోని 18 జడ్పీటీసీ, 157 ఎంపీటీసీ స్థానాల ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయనుంది. కోర్టు తీర్పు కోసం జిల్లాలోని రాజకీయ పార్టీలు, నాయకులు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Similar News
News October 8, 2025
MHBD: హెడ్మాస్టర్‌కు పాముకాటు

పాఠశాలలో ఉపాధ్యాయురాలికి పాము కాటు వేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండలంలోని కొడిసెల మిట్ట ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ పి. సరితకు మంగళవారం మధ్యాహ్నం పాఠశాలలో పాము కాటు వేసింది. గమనించిన స్థానికులు చికిత్స కోసం వెంటనే గంగారం ప్రాథమిక వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని గ్రామస్థులు తెలిపారు.
News October 8, 2025
ప్రతి శనివారం టిడ్కో ఇళ్ల కేటాయింపు: మంత్రి

AP: 2026 జూన్ నాటికి టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లను ప్రతి శనివారం లబ్ధిదారులకు కేటాయించాలని సూచించారు. రాబోయే రెండేళ్లలో అమృత్ 2.0 స్కీమ్‌లో భాగంగా పట్టణాల్లో 90 శాతం ఇళ్లకు తాగునీరు అందించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని పేర్కొన్నారు. గడువులోగా సంబంధిత తాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయాలని సూచించారు.
News October 8, 2025
భక్తి ఉంటే చాలు.. శివుడే అడ్డంకుల్ని తొలగిస్తాడు!

భక్తి యోగం అన్ని మార్గాలకంటే అత్యంత శ్రేష్ఠమైనది. దీనికి సంపద, జ్ఞానమనే కఠిన నియమాలు అవసరం లేదు. నిష్కల్మషమైన భక్తి ఉంటే చాలు. అలాంటి భక్తులకు, భక్తవత్సలుడైన పరమేశ్వరుడే స్వయంగా అన్ని అడ్డుగోడలను, విఘ్నాలను తొలగిస్తాడు. ఏ కష్టమూ లేకుండా తత్వజ్ఞానం లభించేలా అనుగ్రహిస్తాడు. శివుని దయతోనే ముక్తి, బ్రహ్మజ్ఞానం సాధ్యమవుతాయి. మనల్ని రక్షించేది, భక్తి మార్గంలో నడిపించేది ఆ పరమ శివుడే! <<-se>>#Daivam<<>>