News October 8, 2025

PDPL: కోర్టు తీర్పుపై ఆశావహుల్లో టెన్షన్

image

బీసీ రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందోనని జిల్లాలోని ఆశావాహులు టెన్షన్ పడుతున్నారు. ఒకవేళ కోర్టు తీర్పు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వస్తే ఇదివరకు ప్రకటించిన BC రిజర్వేషన్లు మారుతాయని ఆందోళన చెందుతున్నారు. కాగా, జిల్లాలో 263 సర్పంచ్, 2432 వార్డులు, 13 ZPTC, 137 MPTC స్థానాలలో ఇప్పటికే పోటీకి సిద్ధపడ్డ అభ్యర్థులు తమ రిజర్వేషన్లు ఉంటాయా? పోతాయా? అనే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు.

Similar News

News March 15, 2026

102 ఏళ్ల బామ్మ.. రోజూ మద్యం, మాంసం తీసుకుంటూ..

image

చక్కటి జీవనశైలితోనే ఎక్కువ కాలం జీవిస్తారనే సిద్ధాంతానికి సవాల్ విసురుతున్నారు చైనాకు చెందిన జిన్ బావోలింగ్(102). ఆమె రోజూ పంది మాంసం, కేక్స్, బ్రెడ్స్, బ్రౌన్ షుగర్‌తో కాఫీ, ఆల్కహాల్ తీసుకుంటారు. రోజుకు 15 గంటలు నిద్రపోతారు. కూరగాయలు అరుదుగా తినే బామ్మ ఇప్పటికీ శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నారు. గత 50 ఏళ్లలో ఆస్పత్రి మెట్లు ఎక్కలేదని కుటుంబీకులు చెప్పారు. జిన్ స్టోరీ SMలో వైరలవుతోంది.

News March 15, 2026

KTDM: ప్రియుడితో కలిసి భర్త హత్య.. కూతురు చెప్పడంతో వీడిన మిస్టరీ

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తిప్పనపల్లిలో ఎస్‌డీ జాఫర్ హత్య కలకలం రేపింది. భార్య ఖతీజా ప్రియుడి సహాయంతో భర్తను హత్య చేసి మద్యం తాగడంతో చనిపోయాడని, సహజ మరణంగా చిత్రీకరించింది. అంత్యక్రియల తర్వాత ఎనిమిదేళ్ల కుమార్తె చెప్పిన వివరాలతో విషయం వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 15, 2026

మార్చి 31లోపు ఈ పనులు చేయండి!

image

FY26 ముగిసేలోపు(మార్చి 31) పొదుపు ఖాతాల్లో కనీస మొత్తం డిపాజిట్ చేయాలి. లేదంటే అవి బ్లాక్ అయ్యే ప్రమాదం ఉంది. రీయాక్టివేట్ చేయడానికి ఫైన్ చెల్లించాలి.
* పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో ఏటా కనీసం ₹500 డిపాజిట్ చేయాలి. లేదంటే ₹50 జరిమానా.
* సుకన్య సమృద్ధి యోజన యాక్టివ్‌గా ఉండాలంటే ₹250 డిపాజిట్ చేయాలి. లేదంటే ₹50 ఫైన్.
* నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో ఏటా ₹1,000 డిపాజిట్ చేయాలి. లేదంటే ₹100 పెనాల్టీ.