News October 8, 2025

మంచిర్యాల: నేడే కీలక తీర్పు.. జిల్లాలో ఉత్కంఠ

image

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన కీలకమైన కోర్టు తీర్పు నేడు వెలువడనుంది. దీంతో మంచిర్యాల జిల్లాలో ఉత్కంఠ నెలకొంది. ఈ తీర్పు జిల్లాలోని 16 జడ్పీటీసీ, 129 ఎంపీటీసీ స్థానాల ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయనుంది. కోర్టు తీర్పు కోసం జిల్లాలోని రాజకీయ పార్టీలు, నాయకులు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Similar News

News March 13, 2026

గురుకులాల్లో నాణ్యమైన ఆహారం అందించాలి: కలెక్టర్ అంకిత్

image

కొత్తగూడెం జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యతపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని అధికారులను కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో కలుషిత ఆహార ఘటనలు పునరావృతం కావొద్దని హెచ్చరించారు. ఆహారం కలుషితం కావడానికి గల కారణాలను విశ్లేషించి, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

News March 13, 2026

ఖమ్మం: ‘గ్రీన్ గోల్డ్’ సాగుతో రైతులకు సుస్థిర ఆర్థికాభివృద్ధి

image

వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులకు నాంది పలుకుతూ సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా ఔషధ మొక్కల సాగును ప్రోత్సహించే లక్ష్యంతో ఖమ్మం జిల్లాలో నిర్వహించిన ఒకరోజు శిక్షణ, సామర్థ్యాభివృద్ధి కార్యక్రమం విజయవంతమైంది. గురుదక్షిణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో NMPBతో పాటు కేరళ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సహకారంతో జరిగిన ఈ సదస్సులో DFO సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ దిశానిర్దేశం చేశారు.

News March 13, 2026

ఖమ్మం: గడ్డి మందును నిషేదించాలని కేంద్రమంత్రి కోరిన ఎంపీ

image

అనేక అనర్థాలు, ఆత్మహత్యలకు కారణమవుతున్న గడ్డిమందును నిషేధించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కోరారు. గురువారం ఢిల్లీలో మంత్రిని కలిశారు. విషపూరిత మందు వల్ల ప్రాణనష్టం జరుగుతోందని వివరించారు. ఇప్పటికే పలు దేశాలు దీన్ని నిషేధించాయన్నారు.