News October 8, 2025

‘బకాయిలు చెల్లించేవరకు విద్యార్థులకు అనుమతి నిరాకరణ’

image

ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఫీజు బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో కరీంనగర్ జిల్లాలోని పలు పాఠశాలలు విద్యార్థులను అనుమతించడం లేదు. బకాయిలు విడుదలయ్యే వరకు విద్యార్థులను అనుమతించబోమని పాఠశాలల యజమాన్యాలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. దీంతో తమ పిల్లల చదువులకు ఆటంకం కలుగుతుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించాలని కోరుతున్నారు.

Similar News

News October 8, 2025

KNR: నేడే తీర్పు.. సర్వత్రా ఉత్కంఠత..!

image

స్థానిక సంస్థల ఎన్నికల్లో BCలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన GOను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై నేడే హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం కలిపి 60 ZPTCలు, 646 MPTCలు, 1,216 GP స్థానాలున్నాయి. కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుందా?, లేదా వ్యతిరేకంగా వస్తుందా? COMMENT.

News October 7, 2025

ఎన్నికల విధులు నిర్లక్ష్యం చేయవద్దు: కలెక్టర్

image

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నోడల్ అధికారులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి పమేలా సత్పతి ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎంసీసీ) అమలుపై అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో విధులు కేటాయించబడిన అధికారులు ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పనిచేయాలని సూచించారు.

News October 7, 2025

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: కలెక్టర్

image

మహిళా ఆటో డ్రైవర్లు ఆర్థిక సాధికారత సాధించి తోటి మహిళలకు ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో దుర్గాబాయి దేశ్‌ముఖ్ మహిళా, శిశు వికాస కేంద్రంలో ఎలక్ట్రిక్ ఆటో డ్రైవింగ్‌లో శిక్షణ పొంది ఉపాధి పొందుతున్న మహిళలతో ఆమె మంగళవారం సమావేశమయ్యారు. మహిళలు కేవలం డ్రైవింగ్‌లోనే కాక విభిన్న రంగాలలో రాణించాలని ఆకాంక్షించారు.