News October 8, 2025

ADB: నేడే కీలక తీర్పు.. జిల్లాలో ఉత్కంఠ

image

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన కీలకమైన కోర్టు తీర్పు నేడు వెలువడనుంది. దీంతో ఆదిలాబాద్ జిల్లాలో ఉత్కంఠ నెలకొంది. ఈ తీర్పు జిల్లాలోని 20 జడ్పీటీసీ, 166 ఎంపీటీసీ స్థానాల ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయనుంది. కోర్టు తీర్పు కోసం జిల్లాలోని రాజకీయ పార్టీలు, నాయకులు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Similar News

News October 8, 2025

ఆదిలాబాద్: నామినేషన్‌లు వేయాల్సింది అక్కడే..!

image

ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ఆయా మండలాల మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయాలలో, జడ్పీటీసీ సభ్యుల నామినేషన్ల స్వీకరణ మండల పరిషత్ కార్యాలయంలో స్వీకరించనున్నట్లు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, ఉపసంహరణ ప్రక్రియలను మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహిస్తూ సమయపాలన పక్కాగా పాటించాలన్నారు. అభ్యర్థి సహా ముగ్గురిని మాత్రమే లోనికి అనుమతించాలని సూచించారు.

News October 8, 2025

ADB: RTO చలాన్ APK ఫైల్ ఓపెన్ చేయకండి

image

RTO చలాన్ పేరుతో ఓ APK ఫైల్ సోషల్ మీడియా వాట్సాప్‌లో చక్కర్లు కొడుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో పలువురికి గుర్తుతెలియని నంబర్ నుంచి ఈ మెసేజ్ వచ్చింది. చలాన్ పెండింగ్ ఉందని, కోర్టులో కట్టాలని FORM నింపాలంటూ డీటెయిల్స్‌తో కూడిన APK ఫైల్ వచ్చింది. ఇది సైబర్ నేరగాళ్ల పన్నాగమని, ఎవరూ కూడా ఈ APKను ఓపెన్ చేయవద్దని పోలీసులు సూచించారు. ఆ మెసేజ్‌ను వెంటనే డిలీట్ చేయాలన్నారు.

News October 8, 2025

ADB: మూఢ నమ్మకాలకు ఆజ్యం పోస్తున్న ఆకతాయిలు

image

సాంకేతికత రోజురోజుకి అభివృద్ధి చెందుతున్నా ప్రజలను మూఢనమ్మకాలు గాఢాంధకారంలోకి నెట్టేస్తున్నాయి. పౌర్ణమి అమావాస్య రోజుల్లో కొందరు ఆకతాయిలు రోడ్లపై నిమ్మకాయలు పసుపు కుంకుమ వంటివి వేసి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. ఆశ్వయుజ పౌర్ణమి సందర్భంగా జిల్లాలో పలుచోట్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అధికారులు ప్రజలకు మూఢనమ్మకాలపై అవగాహన కల్పిస్తే ఇలాంటి భయం లేకుండా ఉంటుందని భౌతిక వాదులు పేర్కొన్నారు.