News April 7, 2024
హీరోయిన్‌కు హత్యా బెదిరింపులు

తెలుగులో తేజ దర్శకత్వంలో ‘ధైర్యం’ సినిమాలో హీరోయిన్‌గా చేసిన రైమా సేన్.. ప్రస్తుతం ‘మా కాళి’ అనే చిత్రంలో నటిస్తున్నారు. 1946 ఆగస్టు 16న కోల్‌కతాలో జరిగిన ఓ ఘటన ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా పోస్టర్ చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నావని కొందరు వ్యక్తులు తనకు కాల్స్ చేసి బెదిరిస్తున్నారని రైమా సేన్ వాపోయారు. హత్యా బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు.
Similar News
News April 20, 2026
GNT: కేటుగాడి ఆట కట్టించిన పోలీసులు

సామాజిక మాధ్యమాల ద్వారా సంపన్న యువతులే లక్ష్యంగా వలవేస్తున్న వట్టిచెరుకూరు మండలం చామళ్లమూడి గ్రామానికి చెందిన కోడూరి చంద్రశేఖర్ ఆజాద్‌ను HYDలోని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమ పేరుతో దగ్గరై ఏకాంత ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడేవాడు. ఇలా రెండేళ్లలో 20 మందికి పైగా అమ్మాయిల నుంచి లక్షల్లో నగదు, బంగారం వసూలు చేశాడు. HYDలో ఓ మైనర్ బాలిక నుంచి ఏకంగా రూ.20 లక్షలు కాజేశాడు.
News April 20, 2026
తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రా. పసిడి రూ.490 తగ్గి రూ.1,55,290 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రా. గోల్డ్ రూ.450 తగ్గి రూ.1,42,350కి చేరింది.
News April 20, 2026
ఇక నుంచి యాక్టివ్‌గా కేసీఆర్!

TG: నేడు జగిత్యాలలో జరిగే బహిరంగ సభతో కేసీఆర్ పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వనున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల (2024) తర్వాత కేసీఆర్ ప్రజల మధ్యకు రాలేదు. అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరుకావడం లేదు. దీంతో నేడు జరగబోయే సభ రాజకీయంగా కీలకంగా మారనుంది. కేసీఆర్ ఇక నుంచి యాక్టివ్ అవుతారని, ప్రభుత్వ వైఫల్యాలపై నేటి సభలో విరుచుకుపడతారని గులాబీ వర్గాలు చెబుతున్నాయి. మరి కేసీఆర్ ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తారో చూడాలి.


