News October 8, 2025
WNP: ఎన్నికల నిబంధనల ప్రకారమే నడుచుకోవాలి: అ.కలెక్టర్

వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ యాదయ్య స్థానిక సంస్థల ఎన్నికల శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం జెడ్పీ గర్ల్స్ హైస్కూల్‌లో పరిశీలించారు. ఎన్నికలు పారదర్శకంగా, సజావుగా నిర్వహించడంలో పి.ఓ (PO), ఏ.పి.ఓ (APO)లదే కీలక పాత్ర అని ఆయన అన్నారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించాలి తప్ప, స్వంత నిర్ణయాలు అమలు చేయడానికి వీలు లేదని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News March 11, 2026
మరికల్: ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

మహబూబ్‌నగర్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న కల్వకుర్తికి చెందిన రఘుకుమార్ బుధవారం మరికల్ రైల్వే స్టేషన్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. రైలు కోసం వేచి చూసిన ఆయన, అది రాకపోవడంతో అక్కడే ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించారు. గమనించిన స్థానికులు వెంటనే అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. విద్యుత్ షాక్ తగిలి గాయపడటంతో 108 వాహనంలో మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించారు.
News March 11, 2026
ప్రియుడితో పోలీస్ స్టేషన్‌కు మోనాలిసా!

కుంభమేళాతో పాపులరైన మోనాలిసా కేరళం పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమయ్యారు. తనకు, ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌కు రక్షణ కల్పించాలని తిరువనంతపురంలోని థంపనూర్ పోలీసులను ఆశ్రయించారు. తమ ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించలేదని ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె పేరెంట్స్‌ను పిలిచి పోలీసులు నచ్చజెప్పారు. తర్వాత తన ప్రియుడితో మోనాలిసా వెళ్లిపోయారని తెలిపారు. ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఫర్మాన్‌తో ఆమె ఏడాదిన్నరగా ప్రేమలో ఉన్నారు.
News March 11, 2026
నెల్లూరులో 13 పంచాయతీలకు ‘రూర్బన్’ హోదా

నెల్లూరు జిల్లాలో పంచాయతీలకు గ్రేడ్లు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. వాటిలో జనాభా ప్రాతిపదికన 13 పంచాయతీలకు ‘రూర్బన్’ హోదా లభించింది. అల్లూరు, బోగోలు, కోట, కోవూరులో 2 పంచాయతీలు, ముత్తుకూరులో 2 పంచాయతీలు, పొదలకూరు, రాపూరు, సంగం, ఉదయగిరి, వింజమూరు, కలువాయి పంచాయతీలు ఉన్నాయి. ఇక మీదట ఈ పంచాయతీల్లో మున్సిపాలిటీ తరహాలోనే పాలన కొనసాగనుంది.


