News October 8, 2025
శుభ సమయం (08-10-2025) బుధవారం

✒ తిథి: బహుళ పాడ్యమి ఉ.7.31 వరకు
✒ నక్షత్రం: అశ్విని రా.2.19 వరకు
✒ శుభ సమయం: ఉ.10.00-ఉ.10.30, సా.4.05-సా.5.05
✒ రాహుకాలం: మ.12.00-మ.1.30
✒ యమగండం: ఉ.7.30-ఉ.9.00
✒ దుర్ముహూర్తం: ఉ.11.36-మ.12.24
✒ వర్జ్యం: రా.10.32-రా.12.02
✒ అమృత ఘడియలు: రా.7.33-రా.9.03
Similar News
News October 8, 2025
ప్రతి శనివారం టిడ్కో ఇళ్ల కేటాయింపు: మంత్రి

AP: 2026 జూన్ నాటికి టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లను ప్రతి శనివారం లబ్ధిదారులకు కేటాయించాలని సూచించారు. రాబోయే రెండేళ్లలో అమృత్ 2.0 స్కీమ్‌లో భాగంగా పట్టణాల్లో 90 శాతం ఇళ్లకు తాగునీరు అందించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని పేర్కొన్నారు. గడువులోగా సంబంధిత తాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయాలని సూచించారు.
News October 8, 2025
భక్తి ఉంటే చాలు.. శివుడే అడ్డంకుల్ని తొలగిస్తాడు!

భక్తి యోగం అన్ని మార్గాలకంటే అత్యంత శ్రేష్ఠమైనది. దీనికి సంపద, జ్ఞానమనే కఠిన నియమాలు అవసరం లేదు. నిష్కల్మషమైన భక్తి ఉంటే చాలు. అలాంటి భక్తులకు, భక్తవత్సలుడైన పరమేశ్వరుడే స్వయంగా అన్ని అడ్డుగోడలను, విఘ్నాలను తొలగిస్తాడు. ఏ కష్టమూ లేకుండా తత్వజ్ఞానం లభించేలా అనుగ్రహిస్తాడు. శివుని దయతోనే ముక్తి, బ్రహ్మజ్ఞానం సాధ్యమవుతాయి. మనల్ని రక్షించేది, భక్తి మార్గంలో నడిపించేది ఆ పరమ శివుడే! <<-se>>#Daivam<<>>
News October 8, 2025
పృథ్వీ.. ఎందుకీ పరే’షా’న్!

పృథ్వీ షాకు టాలెంట్ ఉన్నా డిసిప్లేన్ లేదని, కాంట్రవర్సీలతో కెరీర్ నాశనం చేసుకుంటున్నాడన్న పేరుంది. ఫిట్‌నెస్, ఫామ్ లేమితో IND జట్టుకు దూరమైన షా.. ఇటీవల దేశవాళీ టోర్నీల్లో రాణిస్తున్నాడు. ఇంతలోనే <<17943633>>మరో గొడవతో<<>> వార్తల్లోకెక్కాడు. 2018 U19 WC గెలిచిన జట్టుకు కెప్టెన్‌గా ఉన్న షా, ఆ స్థాయికి తగ్గట్లుగా కెరీర్‌ను మలుచుకోలేకపోయాడని, అప్పుడు VCగా ఉన్న గిల్ ఇప్పుడు కెప్టెన్ అయిపోయాడని నెటిజన్లు అంటున్నారు.