News October 8, 2025
అక్టోబర్ 8: చరిత్రలో ఈరోజు

1895: రచయిత అడివి బాపిరాజు జననం
1932: సినీ రచయిత శివ శక్తి దత్త జననం
1935: నటుడు మందాడి ప్రభాకర రెడ్డి జననం
1963: తెలుగు సినిమా నటుడు సీఎస్ఆర్ ఆంజనేయులు మరణం
1970: సినీ నటుడు, నిర్మాత నెల్లూరు కాంతారావు మరణం
1974: సినీ దర్శకుడు బి.ఆర్.పంతులు మరణం
* భారత వైమానిక దళ దినోత్సవం
Similar News
News October 8, 2025
రోజూ ‘ఓం గం గణపతయే నమః’ అని పఠిస్తే..?

ఈ మంత్రాన్ని రోజూ జపిస్తే విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో అడ్డంకులు తొలగి, జ్ఞానం, శ్రేయస్సు వృద్ధి చెందుతాయని పండితులు చెబుతున్నారు. ‘జపమాలతో పాటు ఈ మంత్రాన్ని 108 సార్లు ఉచ్ఛరిస్తే మనలోని అసమతుల్యతలు తొలగి, మనసుకు స్థిరత్వం లభిస్తుంది. దోషాలు పోతాయి. దైవత్వం వైపు అడుగు పడుతుంది’ అని వివరిస్తున్నారు. ✍️ ప్రతిరోజు ఆసక్తికరమైన ఆధ్యాత్మిక సమాచారం కోసం <<-se_10013>>భక్తి<<>> కేటగిరీకి వెళ్లండి.
News October 8, 2025
రాష్ట్రంలో 1,743 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తులు ఆహ్వానం

TGSRTCలో 1,743 డ్రైవర్, శ్రామిక్ పోస్టులకు నేటి నుంచి ఈ నెల 28 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. డ్రైవర్ పోస్టులకు టెన్త్‌తో పాటు హెవీ ప్యాసింజర్ మోటారు వెహికల్ లైసెన్స్, శ్రామిక్ పోస్టులకు ITI పాసై ఉండాలి. నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికెట్ ఉంటే ప్రాధాన్యం ఉంటుంది. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. తెలంగాణ పోలీస్ నియామక మండలి ఈ పోస్టులను భర్తీ చేయనుంది. వెబ్‌సైట్: https://www.tgprb.in/
News October 8, 2025
ఉచిత పథకాలతో అభివృద్ధికి ఆటంకం: వెంకయ్య నాయుడు

రాష్ట్రప్రభుత్వాలు ఉచిత పథకాల కంటే అభివృద్ధిపై దృష్టి సారించాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. ఎన్నికల్లో ప్రయోజనాల కోసం ఉచితాలు ప్రకటించడం అలవాటుగా మారిందని, దీని వల్ల అప్పులు పెరిగి అభివృద్ధి కుంటుపడుతోందని విలేకర్లతో తెలిపారు. దీర్ఘకాలిక ప్రాజెక్టుల (సాగునీటి, విద్యుత్) నిర్మాణం కోసం అప్పులు చేస్తే ప్రయోజనం ఉంటుందన్నారు. ప్రభుత్వాలు విద్య, వైద్యంపై దృష్టి సారించాలని హితవు పలికారు.