News October 8, 2025

WNP: పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి: ఎస్పీ

image

వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్ మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో కోర్టు డ్యూటీ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. కోర్టు కేసుల్లో నిందితులకు శిక్షలు పడితేనే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని ఎస్పీ అన్నారు. కేసులు పెండింగ్‌లో లేకుండా త్వరగా పరిష్కరించి, నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

Similar News

News March 25, 2026

KMR: ఎస్సీ యాక్షన్ ప్లాన్ దరఖాస్తు గడువు పొడిగింపు

image

కామారెడ్డి జిల్లాలో 2025-26 ఎస్సీ యాక్షన్ ప్లాన్ ఫేజ్-1 దరఖాస్తు గడువును ఏప్రిల్ 2 వరకు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. అలాగే ఫేజ్-2 కింద డ్రోన్లు, డైరీ, ఈవీ వాహనాలు, వ్యవసాయ పనిముట్ల వంటి పథకాలకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అర్హులైన SC నిరుద్యోగ యువత OBMMS పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకుని, ఆ ఫారాలను MPDO కార్యాలయంలో సమర్పించాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News March 25, 2026

బొబ్బిలి: అదరగొట్టిన ధన్షిక.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు

image

బొబ్బిలి మండలం కొత్తపెంటకు చెందిన లక్షుంనాయుడు, హారిక దంపతుల కుమార్తె సిరికి ధన్షిక (22 నెలలు) అరుదైన ఘనత సాధించింది. అద్భుత జ్ఞాపకశక్తితో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇన్ఫ్‌ఫ్లుయెన్సర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఆల్ఫాబెట్స్, వారాలు, నెలలు, నేషనల్ సింబల్స్, శ్లోకాలు, అంకెలు, రైమ్స్ చెబుతూ ఆశ్చర్యపరుస్తోంది. ఈ చిన్నారి 5 నెలలకే నోబెల్ వరల్డ్ రికార్డ్ కూడా సాధించింది.

News March 25, 2026

అనకాపల్లి జిల్లాలో కొత్తగా 3 నియోజకవర్గాలు..!

image

అనకాపల్లి జిల్లాలో కొత్తగా 3 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. కొత్తగా పరవాడ, గొలుగొండ, కె.కోటపాడు నియోజకవర్గ కేంద్రాలుగా ఏర్పడవచ్చునని భావిస్తున్నారు. పరవాడ, మునగపాక అచ్యుతాపురం మండలాలు, గొలుగొండ, నాతవరం, రోలుగుంట మండలాలు, కె.కోటపాడు, సబ్బవరం, దేవరాపల్లి మండలాలతో 3 కొత్త నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉంది.