News October 8, 2025
సినీ ముచ్చట్లు

* ఫన్ కోసం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తుంటా. చాలా క్రియేటివ్‌గా ఉంటాయి. ట్విటర్‌లో మొత్తం నెగెటివిటీ ఉంటుంది. అందుకే దూరంగా ఉంటా: ‘మాస్ జాతర’ ఇంటర్వ్యూలో రవితేజ
* ‘జాతిరత్నాలు’ అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్‌సేన్ నటిస్తున్న ‘ఫంకీ’ మూవీ టీజర్ ఈ నెల 10న విడుదల
* యాక్టర్స్ పేరింగ్‌పై ట్రోల్స్.. రవితేజతో పనిచేయడం కంఫర్టబుల్‌గా ఉందన్న శ్రీలీల
* OCT 9న ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’ సినిమా ట్రైలర్
Similar News
News October 8, 2025
EPFO కనీస పింఛన్ రూ.2,500కు పెంపు?

ఈపీఎఫ్‌వో చందాదారులకు కనీస పింఛన్ రూ.2,500కు పెంచనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 10, 11న ట్రస్టీల భేటీలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పింఛను పెంపుపై నిర్ణయం తీసుకుంటే కేంద్రం ఆమోదించాల్సి ఉంటుంది. మరోవైపు రూ.7,500 ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం నెలకు రూ.1,000 పింఛన్ అందుతోంది. 10 ఏళ్ల రెగ్యులర్ సర్వీసు, 58 ఏళ్లు పూర్తి చేసుకున్న వారు ఇందుకు అర్హులు.
News October 8, 2025
దయచేసి మాకు పోటీగా రాకండి: గ్రూప్-3 ర్యాంకర్లు

TG: గ్రూప్-2 ఉద్యోగానికి ఎంపికైన వారు తమకు పోటీగా రావొద్దని గ్రూప్-3కి క్వాలిఫై అయిన ర్యాంకర్లు కోరారు. వెబ్ ఆప్షన్, సర్టిఫికెట్ల పరిశీలనకు దూరంగా ఉండాలని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వేడుకున్నారు. గ్రూప్3 పోస్టులకు ఎంపికైన గ్రూప్2 అభ్యర్థులు 500 మంది ఉన్నారని, అధ్యాపకులు, SIలు మరో 600 మంది ఉన్నారని తెలిపారు. వీరు కోర్టు కేసుల నేపథ్యంలో గ్రూప్3 పోస్టులను బ్యాకప్ ఆప్షన్‌గా భావిస్తున్నట్లు తెలుస్తోంది.
News October 8, 2025
రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే ఇలా చేయండి!

ఉదయం మీరు చేసే చిన్న పనులు రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. తేలికపాటి వ్యాయామం రక్తప్రసరణను, శక్తిని పెంచుతుంది. మానసిక స్థితి మెరుగవుతుంది. ఉదయం నీరు తాగితే శరీరం తక్షణమే హైడ్రేట్ అవడంతో పాటు జీవక్రియ మెరుగవుతుంది. అంతేకాక ప్రొటీన్లు, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఉన్న సమతుల్య అల్పాహారం తీసుకుంటే రోజంతా శక్తి అందుతుంది. కొద్దిసేపు సూర్యరశ్మిలో ఉంటే చురుకుదనం పెరుగుతుంది.