News October 8, 2025
HYD: వరల్డ్ స్కిల్ కాంపిటీషన్.. అప్లై చేసుకోండి

వరల్డ్ స్కిల్ కాంపిటీషన్-2025లో పాల్గొనేందుకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 15లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారిణి వందన తెలిపారు. ఈ పోటీల్లో 63 కేటగిరీలలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించవచ్చు. జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు ఉంటాయి. ఉమ్మడి RR, HYD జిల్లాలోని అర్హత కలిగిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News March 25, 2026
సింహాచలం: చందనోత్సవం రోజున కార్యక్రమాలు ఇలా..

సింహాచలం చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరోజున వేకువ జాము ఒంటి గంటకు సుప్రభాత సేవ, 3 గంటలకు ఆలయ వ్యవస్థాప ధర్మకర్త తొలి దర్శనం ప్రారంభమవుతుంది. 3.30 గంటలకు ప్రభుత్వం నుంచి పట్టువస్త్రాలు, అనంతరం తితిదే వారి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. 4.15 నుంచి 4.30 గంటల లోపు మొదటి స్లాట్ వీఐపీ దర్శనాలు మొదలవుతాయి. 4 గంటల నుంచి దర్శనాలు ప్రారంభమవుతాయి.
News March 25, 2026
జగిత్యాల ఎంపీ స్థానం ఖాయమేనా..?

నియోజకవర్గాల పునర్విభజన అంశం ఉమ్మడి KNR(D)లో కొత్త చర్చకు తెరలేపింది. ప్రస్తుతం ఉన్న 13 అసెంబ్లీ స్థానాలు పునర్విభజన తర్వాత 21కి పెరిగే అవకాశం ఉండటంతో, KNR, పెద్దపల్లితో పాటు మరో లోక్‌సభ స్థానం ఏర్పడే వీలుంది. ప్రస్తుతం నిజామాబాద్ MP పరిధిలో ఉన్న JGTL, KRTL నియోజకవర్గాలతో పాటు మరికొన్నింటిని కలిపి జగిత్యాల లోక్ సభ స్థానం ఏర్పాటయ్యే అవకాశముంది. దీంతో జిల్లా రాజకీయ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి.
News March 25, 2026
సమ్మర్ షాక్.. పెరగనున్న ACల ధరలు

ఈ వేసవిలో ACల ధరలు 8% నుంచి 12% వరకు పెరగనున్నాయి. జనవరి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త BEE (Bureau of Energy Efficiency) ఎనర్జీ రేటింగ్ నిబంధనల వల్ల తయారీ ఖర్చు పెరిగింది. వీటికి తోడు అంతర్జాతీయ మార్కెట్‌లో కాపర్, అల్యూమినియం వంటి ముడి పదార్థాల ధరలు పెరగడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడటం కంపెనీలపై భారాన్ని పెంచాయి. ఈ అదనపు వ్యయాన్ని తగ్గించుకోవడానికి ప్రముఖ బ్రాండ్లు ధరలను పెంచుతున్నాయి.


