News October 8, 2025
కామారెడ్డి: పారామెడికల్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో పారామెడికల్ కోర్సుల ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అదనపు డీఎంఈ, ప్రిన్సిపాల్ వాల్య పేర్కొన్నారు. DMLT 30 సీట్లు, DECG 30 సీట్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తులు OCT 8 నుంచి 28 వరకు స్వీకరించనున్నట్లు చెప్పారు. https://tgpmb.telangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని, తగు పత్రాలను ప్రభుత్వ వైద్య కళాశాల కామారెడ్డిలో అందజేయాలన్నారు.
Similar News
News March 11, 2026
సంగారెడ్డి: ఇస్రో స్పేస్ ట్రైనింగ్‌లో 42 మంది విద్యార్థులు

జేఎన్టీయూహెచ్‌లోని UCESTH నుంచి 42 మంది విద్యార్థులు ఇస్రో నిర్వహిస్తున్న START-2026 స్పేస్ సైన్స్ శిక్షణకు ఎంపికయ్యారు. ఇస్రో ఛైర్మన్ డాక్టర్ వి.నారాయణన్ సమక్షంలో ఈ ఆన్‌లైన్ శిక్షణ ప్రారంభమైంది. మార్చి 12 నుంచి ఏప్రిల్ 2 వరకు మొత్తం 26 ఆన్‌లైన్ ఉపన్యాసాలు నిర్వహించనున్నారు. అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం.
News March 11, 2026
400 మిలియన్ బ్యారెళ్ల చమురు రిలీజ్ చేయనున్న IEA

అత్యవసర నిల్వల నుంచి 400 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్‌ను రిలీజ్ చేయనున్నట్లు ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (IEA) ప్రకటించింది. క్రూడ్ ఆయిల్ ధరలను నియంత్రించేందుకు 32 సభ్య దేశాలు ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. IEA వద్ద ప్రస్తుతం 1.2 బిలియన్ బ్యారెళ్లకుపైగా చమురు నిల్వలు ఉన్నాయి. ఇలా IEA ఆయిల్ రిలీజ్ చేయడం ఇది ఆరోసారి. గతంలో 1991, 2005, 2011 సహా 2022లో రెండుసార్లు ఆయిల్ రిలీజ్ చేసింది.
News March 11, 2026
జగిత్యాల : నెట్ బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటు

జగిత్యాల జిల్లా నెట్ బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎంఏ ఆరిఫ్, ఉపాధ్యక్షులుగా తిరుపతి, భీమేశ్ లు ఎన్నికయ్యారు. అలాగే జనరల్ సెక్రటరీగా గౌతమ్, ట్రెజరర్ గా సుమంత్, జాయింట్ సెక్రటరీలుగా నవీన్, మణిదీప్, ఈసీ మెంబర్లుగా తేజ, సంధ్య, అక్షయ్, యశ్వంత్ లను ఎన్నుకున్నారు. జిల్లాలో నెట్ బాల్ క్రీడను మరింత అభివృద్ధి పరచడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.


