News October 8, 2025
NZB: హుసాముద్దీన్‌కు గోల్డ్ మెడల్

బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కప్ ఛాంపియన్షిప్‌లో నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన మహమ్మద్ హుసాముద్దీన్ గోల్డ్ మెడల్ సాధించాడు. ఇంటర్నేషనల్ బాక్సర్, అర్జున అవార్డు గ్రహీత మహమ్మద్ హుసాముద్దీన్ తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో జరిగిన BFI కప్ ఛాంపియన్షిప్‌లో 55 – 60 కేజీల వ్యక్తిగత శరీర బరువు కేటగిరిలో పోటీపడ్డాడు. వరుస విజయాలతో దూసుకెళ్లిన హుసాముద్దీన్ గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నాడు.
Similar News
News October 8, 2025
నిజామాబాద్: నేడే తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ..!

స్థానిక సంస్థల ఎన్నికల్లో BCలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన GOను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై నేడే హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా, జిల్లాలో మొత్తం కలిపి 31 ZPTCలు, 307 MPTC స్థానాలున్నాయి. కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుందా?, లేదా వ్యతిరేకంగా వస్తుందా? COMMENT చేయండి.
News October 8, 2025
NZB: నేడే తీర్పు.. జిల్లాలో ఉత్కంఠత

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై బుధవారం హైకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో ఉత్కంఠ నెలకొంది. జిల్లాలో మొత్తం 31 ZPTCలు, 307 MPTC స్థానాలు ఉండగా మండలాల వారీగా రిజర్వేషన్లు ప్రకటించగా అధికారులు ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే.
News October 7, 2025
NZB:అండర్ -19 బాలికల ఫుట్ బాల్ జట్టు ఎంపిక పోటీలు

రాష్ట్ర స్థాయి ఫుట్ బాల్ టోర్నమెంట్ పోటీలలో పాల్గొనేందుకు అండర్ -19 బాలికల జిల్లా జట్టు ఎంపిక చేయడానికి ఈనెల 9న పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపూడి రవికుమార్ తెలిపారు. రాష్ట్ర స్థాయి ఫుట్ బాల్ టోర్నమెంటు ఈ నెల 11,12,13 తేదీలలో సంగారెడ్డిలో నిర్వహిస్తున్నరన్నారు. ఈ జట్టులో పాల్గొనేందుకు నగరంలోని రాజారాం స్టేడియంలో ఈనెల 9న ఉదయం 10 జట్ల ఎంపికలు ఉంటాయన్నారు.