News October 8, 2025

సంగారెడ్డి: సదరం శిబిరం షెడ్యూలు విడుదల

image

దివ్యాంగుల కోసం అక్టోబర్ నెలకు సంబంధించిన సదరం షెడ్యూలు విడుదలైనట్లు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండ్ డాక్టర్ మురళీకృష్ణ మంగళవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ ..ఈనెల 14, 16, 18, 21, 23, 25, 28, 30 తేదీల్లో సదరం శిబిరాలు జరుగుతాయని చెప్పారు. దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News October 8, 2025

క్లచ్ చెస్ టోర్నీ: పోటీ పడనున్న దిగ్గజాలు

image

నేడు USAలో క్లచ్ చెస్ టోర్నీ ప్రారంభం కానుంది. చిరకాల ప్రత్యర్థులు, చెస్ దిగ్గజాలు విశ్వనాథన్ ఆనంద్, గ్యారీ గాస్పరోవ్(రష్యా) ఇందులో తర్వాత పోటీ పడనున్నారు. ఈ దిగ్గజాలు ఇప్పటివరకు పోటీ పడిన గేమ్స్‌లో కాస్పరోవ్‌దే‌పై చేయి. మరోవైపు వరల్డ్ నం.1 కార్ల్‌సన్, భారత ప్లేయర్ గుకేశ్ ఈ టోర్నీలో తలపడనున్నారు. అన్ని ఫార్మాట్లలో గుకేశ్‌పై కార్లసన్‌దే ఆధిపత్యం ఉంది.

News October 8, 2025

విశ్వభారతి సెంట్రల్ వర్సిటీలో 54 పోస్టులు

image

విశ్వభారతి సెంట్రల్ యూనివర్సిటీ 54 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈ నెల 31వరకు అప్లై చేసుకోవచ్చు. వివిధ విభాగాల్లో ప్రొఫెసర్ పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయనుంది. అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనుంది. దరఖాస్తు ఫీజు రూ.2వేలు, మహిళలు, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు కలదు. వెబ్‌సైట్: https://www.visvabharati.ac.in/

News October 8, 2025

KNR: డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

image

కరీంనగర్ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో 2025- 26 విద్యాసంవత్సరానికి DMIT, DANS డిప్లొమా కోర్సులకు అర్హులైన MPC, Bi.PC అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 28లోపు కళాశాలలో అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించాలని, మరిన్ని వివరాలకు కళాశాల పోర్టల్‌ను సందర్శించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. WEBSITE: http://www.gmknr.com. SHARE IT.