News October 8, 2025

తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కట్టితీరుతాం: మంత్రి ఉత్తమ్

image

TG: ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని కట్టి తీరుతామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ‘2 అలైన్‌మెంట్లను పరిశీలిస్తున్నాం. ఈనెల 22 నాటికి ఒక దానిని ఖరారు చేస్తాం. 1st అలైన్‌మెంట్‌లో తుమ్మిడిహెట్టి-మైలారం 71.5kms గ్రావిటీ కెనాల్, 14kms టన్నెల్ ద్వారా సుందిళ్లకు నీటి తరలింపు, 2nd దానిలో పంపింగ్ స్టేషన్‌తో ఎల్లంపల్లికి నేరుగా నీటిని తరలించే ప్లాన్ ఉంది’ అని తెలిపారు.

Similar News

News October 8, 2025

నీటిలో TDS స్థాయులను చెక్ చేస్తున్నారా?

image

ప్రస్తుతం చాలామంది మినరల్ లేదా ప్యూరిఫయర్ ద్వారా శుద్ధి చేసిన నీటిని తాగుతున్నారు. అయితే సరైన TDS స్థాయులున్న నీటినే తాగాలని వైద్యులు చెబుతున్నారు. TDS గరిష్ఠంగా 500 mg/L మాత్రమే ఉండాలని BIS చెబుతుంటే WHO 300 కంటే తక్కువ ఉంటే బెస్ట్, 300-600 మధ్యలో ఉంటే మంచివంటోంది. అయితే ప్యూరిఫయర్లు నీటిలోని TDS స్థాయులను నియంత్రించగలవు. ఇవి 50 కంటే తక్కువ చేస్తే అందులో ముఖ్యమైన ఖనిజాలను కోల్పోవచ్చు. SHARE IT

News October 8, 2025

దీపావళికి హాలిడే ప్రకటించిన కాలిఫోర్నియా

image

యూఎస్‌లోని మరో రాష్ట్రం దీపావళిని అధికారికంగా సెలవు దినంగా ప్రకటించింది. కాలిఫోర్నియా గవర్నర్ న్యూసమ్ ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని భారతీయులకు సంతోషాన్ని ఇస్తుందని ఆయన తెలిపారు. దీంతో పెన్సిల్వేనియా, న్యూయార్క్ తర్వాత దీపావళిని సెలవు రోజుగా గుర్తించిన మూడో US రాష్ట్రంగా కాలిఫోర్నియా నిలిచింది. ఫిజీ, మలేషియా, నేపాల్, శ్రీలంక, సింగపూర్‌ తదితర దేశాల్లోనూ దీపావళి రోజున సెలవు ఉంది.

News October 8, 2025

BRIC -NABIలో ఉద్యోగాలు

image

BRIC-నేషనల్ అగ్రి ఫుడ్ అండ్ బయో మాన్యుఫాక్చరింగ్ ఇన్‌స్టిట్యూట్‌ 6 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 6వరకు అప్లై చేసుకోవచ్చు. సైంటిస్ట్ F, అసోసియేట్ ప్లాంట్ మేనేజర్, సైంటిస్ట్ C, మేనేజ్‌మెంట్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిగ్రీ, PhD, ఎంటెక్/ఎంఈ, బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: http://ciab.res.in/