News October 8, 2025
రోజూ ‘ఓం గం గణపతయే నమః’ అని పఠిస్తే..?

ఈ మంత్రాన్ని రోజూ జపిస్తే విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో అడ్డంకులు తొలగి, జ్ఞానం, శ్రేయస్సు వృద్ధి చెందుతాయని పండితులు చెబుతున్నారు. ‘జపమాలతో పాటు ఈ మంత్రాన్ని 108 సార్లు ఉచ్ఛరిస్తే మనలోని అసమతుల్యతలు తొలగి, మనసుకు స్థిరత్వం లభిస్తుంది. దోషాలు పోతాయి. దైవత్వం వైపు అడుగు పడుతుంది’ అని వివరిస్తున్నారు. ✍️ ప్రతిరోజు ఆసక్తికరమైన ఆధ్యాత్మిక సమాచారం కోసం <<-se_10013>>భక్తి<<>> కేటగిరీకి వెళ్లండి.
Similar News
News October 8, 2025
చింతిస్తూ పొన్నం వివరణ.. వివాదం ముగిసిందా?

TG: సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌పై కామెంట్ చేయలేదని పొన్నం వివరణ ఇచ్చారు. ‘మరొకరిపై నా మాటలను వక్రీకరించడంతో అడ్లూరి నొచ్చుకున్నారని తెలిసి చింతిస్తున్నా’ అని పేర్కొన్నారు. 30సం.ల తమ స్నేహం రాజకీయాలకు మించినదని, కాంగ్రెస్ సిద్ధాంతాల కోసం కృషి చేస్తామని తెలిపారు. కాగా దళిత సంఘాల హెచ్చరికలతో పొన్నం ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. అటు కాసేపట్లో PCC చీఫ్ ఇద్దరు మంత్రులతో విడివిడిగా మాట్లాడనున్నారు.
News October 8, 2025
బీసీ రిజర్వేషన్లు.. విచారణ వాయిదా

TG: స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తెచ్చిన జీవోపై మధ్యాహ్నం 12.30కు విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లు, తీర్పును చదివి తదుపరి విచారణ చేపడతామని పేర్కొంది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్, అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించనున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు హైకోర్టు వద్దకు చేరుకున్నారు.
News October 8, 2025
NCLTలో 32 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(NCLT)లో 32 స్టెనోగ్రాఫర్, ప్రైవేట్ సెక్రటరీస్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. డిగ్రీ ఉత్తీర్ణులైన కంప్యూటర్ స్కిల్స్, టైపింగ్ నాలెడ్జ్ గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. స్టెనోగ్రాఫర్‌కు నెలకు రూ.45వేలు, ప్రైవేట్ సెక్రటరీకి రూ.50వేలు జీతం అందిస్తారు. వెబ్ సైట్: https://nclt.gov.in/