News October 8, 2025

వికారాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలు.. సీపీఎం పోటీ

image

బొంరాస్ పేట మండలం తుంకిమేట్ల గ్రామంలో మంగళవారం జరిగిన సమావేశంలో CPI(M) జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటయ్య, బుస్స చంద్రయ్య మాట్లాడారు. MPTC, ZPTC ఎన్నికల్లో CPI(M) పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. ప్రజా పోరాటాలు, పేదలు, కార్మికుల సమస్యలపై పోరాటం చేసే ఎర్రజెండా CPI(M) తరపున నిలబడే అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

Similar News

News April 6, 2026

ఇరాన్, USకు సీజ్‌ఫైర్ ప్లాన్.. ఏం జరగబోతోంది?

image

యుద్ధాన్ని ఆపేందుకు ఇరాన్, USకు సీజ్‌ఫైర్ ప్లాన్ అందినట్లు Reuters తెలిపింది. వెంటనే కాల్పుల విరమణకు ఒప్పుకోవాలని, హార్ముజ్‌ను ఓపెన్ చేయాలని ప్రపోజల్స్ పెట్టినట్లు చెప్పింది. ఈ డ్రాఫ్ట్ ప్లాన్‌ను పాక్ రూపొందించినట్లు పేర్కొంది. అన్ని అంశాలపై ఈ రోజే అంగీకారం కుదరాలని సూచించినట్లు వెల్లడించింది. US ఉపాధ్యక్షుడు JD వాన్స్, ఇరాన్ మంత్రి అరాఘ్చీతో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ చర్చించినట్లు తెలిపింది.

News April 6, 2026

సంగారెడ్డి: వివాహేతర సంబంధం.. కత్తితో పొడిచి చంపిన భర్త

image

సంగారెడ్డి జిల్లాలో వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. స్థానికుల వివరాలిలా.. జహీరాబాద్‌కు చెందిన కవిత(29) గత నెలలో మరొకరితో వెళ్లిపోయింది. జడ్చర్లలో ఆమెను గుర్తించిన పోలీసులు తీసుకొస్తుండగా సదాశివపేట మండలం నందికంది వద్ద మార్గమధ్యంలో భర్త సిద్ధారెడ్డి కత్తితో కవితపై దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News April 6, 2026

VKB: ‘అధికారులు కీలక భూమిక పోషించాలి’

image

ప్రజావాణికి వచ్చే వినతులను పరిష్కరించడంలో అధికారులు కీలక భూమిక పోషించాలని వికారాబాద్ కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో ఆయన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సుదూర ప్రాంతాల నుంచి నమ్మకంతో వచ్చే బాధితులకు న్యాయం జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఒకసారి దరఖాస్తు చేసుకున్న సమస్యలను వెను వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరారు.