News October 8, 2025

ప్రజల్లో అవగాహన పెంచండి: కలెక్టర్

image

వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం అన్నమయ్య జిల్లా కలెక్టరేట్‌లో సబ్‌ కలెక్టర్లు, ఆర్డీఓలు, తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు తదితరులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. PGRS జీవో 30, జలజీవన్ మిషన్, స్వచ్ఛాంధ్ర, రీ- సర్వే వంటి అంశాలను సమీక్షించారు.

Similar News

News March 15, 2026

శ్రీ సత్యసాయి జిల్లాలో ఇద్దరి సూసైడ్

image

శ్రీ సత్యసాయి(D) తాడిమర్రి మండలంలో వేర్వేరు చోట్ల శనివారం ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిడిగల్లు గ్రామానికి చెందిన దీపిక(21) కొన్నేళ్లుగా మూర్ఛ వ్యాధితో బాధపడుతోంది. తీవ్ర మనస్తాపంతో ఇంట్లో ఉరేసుకుంది. పుల్లంపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్(47) అప్పుల బాధ తాళలేక మనస్తాపం చెంది పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

News March 15, 2026

ఏలేశ్వరం కాలువలో వ్యక్తి మృతదేహం కలకలం

image

ఏలేశ్వరం మండలం రమణయ్యపేట వద్ద ఏలేరు కాలువలో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు లింగవరం కాలనీకి చెందిన వ్యాపారిగా పోలీసులు గుర్తించారు. కాలువ గట్టుపై బైక్, నగదు ఉంచి ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 15, 2026

NZB: వారం రోజుల్లో 230 కేసులు: CP

image

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన వారం రోజుల్లో (9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు) 230 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదివారం తెలిపారు. 230 మందిని కోర్టులో హాజరు పరచగా రూ.21.60 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. అలాగే 14 మందికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారని CP వివరించారు.