News October 8, 2025

విశాఖలో వరల్డ్ కప్.. టికెట్ ధర రూ.100 మాత్రమే

image

విశాఖ వేదికగా జరిగే ఉమెన్స్ వరల్డ్‌కప్ మ్యాచ్‌లను రూ.100 చెల్లించి చూసేందుకు ACA అవకాశం కల్పించింది. ఈనెల 12న జరిగే ఇండియా Vs ఆస్ట్రేలియా మ్యాచ్ (రూ.150) మినహా మిగిలిన 4మ్యాచ్‌లకు టికెట్ ధర రూ.100 మాత్రమే.
➤ అక్టోబర్ 9: ఇండియా Vs సౌతాఫ్రికా
➤ అక్టోబర్ 12: ఇండియా Vs ఆస్ట్రేలియా
➤ అక్టోబర్ 13: బంగ్లాదేశ్ Vs సౌతాఫ్రికా
➤ అక్టోబర్ 16: ఆస్ట్రేలియా Vs బంగ్లాదేశ్
➤ అక్టోబర్ 26: ఇంగ్లాండ్ Vs న్యూజిలాండ్

Similar News

News March 20, 2026

వివాహంలో ఆటంకాలు.. సర్ప దోష నివారణకు సూచనలు

image

జాతకంలో సప్తమ, అష్టమ స్థానాల్లో రాహువు లేదా కేతువు ఉన్నప్పుడు సర్ప దోషం ఏర్పడుతుంది. దీనివల్ల సంబంధాలు చివరి నిమిషంలో చెడిపోతుంటాయి. ఈ దోష నివారణకు కాళహస్తి వంటి క్షేత్రాల్లో రాహు-కేతు శాంతి పూజ చేయించుకోవడం ఉత్తమం. ఇంట్లో రోజూ దుర్గా చాలీసా పఠిస్తే రాహువు ప్రభావం తగ్గుతుంది. ప్రతి మంగళ, శుక్రవారాల్లో రాహుకాలంలో దుర్గాదేవికి నిమ్మకాయ దీపం వెలిగించడం వల్ల వివాహానికి ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి.

News March 20, 2026

IPL ఆరంభ మ్యాచ్‌లకు స్టార్క్ దూరం

image

మరో ఆస్ట్రేలియన్ ప్లేయర్ మిచెల్ స్టార్క్ IPL ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నారు. ఈ పేసర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ₹11.75 కోట్లకు సొంతం చేసుకుంది. బిజీ ఇంటర్నేషనల్ షెడ్యూల్ నేపథ్యంలో వర్క్‌లోడ్ మేనేజ్ చేయడం కోసం క్రికెట్ ఆస్ట్రేలియా స్టార్క్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఆసిస్ ప్లేయర్లలో కమిన్స్, హేజిల్‌వుడ్ సైతం కొన్ని IPL మ్యాచ్‌లకు దూరం కానున్నారు. ఎల్లిస్ ఈ సీజన్ మొత్తానికే వైదొలిగారు.

News March 20, 2026

HYDలో రేపటి నుంచి బంద్!

image

రంజాన్ మాసం సందర్భంగా పాతబస్తీలో నెల రోజులుగా సందడిగా సాగుతున్న నైట్ బజార్ రేపటితో ముగియనుంది. చార్మినార్, లాడ్ బజార్ ప్రాంతాలు రాత్రివేళల్లో కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. రేపు రంజాన్ కావడంతో ఈ ప్రత్యేక నైట్ షాపింగ్‌కు తెరపడనుంది. తెల్లవారుజాము వరకు నడిచిన వ్యాపారాలు రేపటి నుంచి మిడ్‌నైట్ వరకే కొనసాగుతాయి. మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో సాయంత్రం నుంచే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.