News October 8, 2025
58 ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB)లో 58 ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి రేపే(OCT 9) ఆఖరు తేదీ. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోగలరు. మేనేజర్, చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్ తదితర పోస్టులున్నాయి. పోస్టును బట్టి ఎకనామిక్స్/కామర్స్‌లో డిగ్రీ, MBA/PGDM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి 24 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్‌సైట్: https://bankofbaroda.bank.in
Similar News
News March 20, 2026
ఇంటి పనులను భర్త షేర్ చేసుకోవాలి: సుప్రీంకోర్టు

తన భార్యకు వంట సహా ఇంటి పనులు సరిగ్గా చేయడం రాదంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కాలం మారిందని, ఇంటి పనులను భర్త కూడా షేర్ చేసుకోవాలని పేర్కొంది. ‘మీరు పనిమనిషిని కాదు.. జీవిత భాగస్వామిని పెళ్లి చేసుకున్నారు’ అని తెలిపింది. తన పేరెంట్స్‌కు ఆహారం పెట్టడానికి ఆమె నిరాకరించిందని భర్త కోర్టుకు చెప్పారు. వాదనలు విన్న న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది.
News March 20, 2026
‘ఎక్కడ ఉన్నా చంపేస్తాం’.. ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

అమెరికా, ఇజ్రాయెల్ అధికారులు, సైనికులకు ఇరాన్ IRGC స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ‘ప్రపంచంలో మీకు ఏ ప్రాంతం సురక్షితం కాదు. రిసార్టులు, టూరిస్టు ప్లేసులు ఇలా మీరు ఎక్కడ ఉన్నా చంపేస్తాం’ అని హెచ్చరించింది. కాగా ఇరాన్ ప్రతినిధులను వరుసగా చంపేస్తుండటంతో IRGC ఈ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
*ఇప్పటివరకు చదవని వార్తల కోసం పైన అన్‌రీడ్ బటన్ క్లిక్ చేసి అప్‌డేట్‌లో ఉండండి.
News March 20, 2026
యుద్ధం కొనసాగితే LPG సప్లయ్ చైన్‌కు దెబ్బే: CBN

AP: ఇరాన్ – ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం మరి కొన్నాళ్లు కొనసాగితే LPG గ్లోబల్ సప్లయ్ చైన్ దెబ్బతినే అవకాశం ఉందని CM CBN ఆందోళన వ్యక్తం చేశారు. ఆ సంక్షోభాన్ని ఎదుర్కొనేలా సమర్ధవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులకు VCలో సూచించారు. ఇండక్షన్ స్టవ్‌లు, PNG వంటి ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఎరువులు, పెట్రోల్, డీజిల్‌కు లోటు రానివ్వకుండా కేంద్రంతో సంప్రదింపులు జరపాలన్నారు.


