News October 8, 2025
ఉమ్మడి వరంగల్‌లో విష జ్వరాలతో మృత్యువాత..!

విషజ్వరాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముగ్గురు మృతి చెందారు. ములుగు(D) వాజేడులో నర్సింగ్ విద్యార్థిని అంజలి, నెక్కొండ(M) గుండ్రపల్లిలో చిన్నారి సహస్ర, లింగాలఘణపురం(M) మాణిక్యాపురంలో మహేష్ మృతి చెందారు. దీంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. లక్షల్లో ఖర్చు చేసి ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదని బాధిత కుటుంబాలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నాయి. జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
Similar News
News March 29, 2026
రేపు బాపట్ల కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్

బాపట్ల కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ ఆదివారం ప్రకటించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అనారోగ్యంతో ఉన్న బాధితులను తీసుకురావద్దని సూచించారు. ఉదయం 9 గంటల నుంచి 10 వరకు అధికారులతో సమీక్ష నిర్వహిస్తామన్నారు. 10 గంటల నుంచి 1 వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జిల్లా అధికారులు హాజరవ్వాలని సూచించారు.
News March 29, 2026
వరంగల్ బస్టాండ్‌లో తాగునీటి కష్టాలు!

వరంగల్ నగరంలో ఎండలు మండిపోతున్న తరుణంలో బస్టాండ్‌కు వచ్చే ప్రయాణికులకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. బస్టాండ్‌లో కనీస మంచినీటి సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవి తీవ్రత పెరుగుతున్నా అధికారులు చలివేంద్రం ఏర్పాటు చేయకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఉచిత తాగునీటి కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
News March 29, 2026
రాజమండ్రి: సమస్యలను కలెక్టర్‌కు తెలపండి

రాజమండ్రి కలెక్టరేట్‌లో మార్చి 30న PGRS రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మండల, మున్సిపాలిటీ స్థాయిల్లో అధికారులు అందుబాటులో ఉండి ప్రజల నుండి అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


