News October 8, 2025
రాజానగరం: రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలోని నరేంద్రపురం, నందరాడ మధ్య మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. రాజానగరం సుబ్బారావు కాలనీకి చెందిన సత్యనారాయణ బైక్‌పై కోరుకొండ నుంచి తిరిగి వస్తుండగా, నందరాడ దాటిన తర్వాత కొవ్వూరుకు చెందిన శ్రీనివాస్ మోటార్ బైక్‌ను బలంగా ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ఇద్దరికి బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు.
Similar News
News October 8, 2025
GNT: ‘ఆశాలకు ₹26 వేల కనీస వేతనం ఇవ్వాలి’

ఆశా వర్కర్స్‌కు నెలకు రూ.26 వేల కనీస వేతనం అమలు చేయాలని, అన్ని రకాల సెలవులు ఇవ్వాలని యూనియన్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం గుంటూరులోని అర్బన్ హెల్త్ సెంటర్ల వద్ద ఆశా వర్కర్స్ నిరసన చేపట్టారు. ఆరేళ్లుగా జీతాలు పెరగలేదని, 5G ఫోన్‌లు ఇవ్వాలని, చనిపోయిన వారికి రూ. 20 వేలు మట్టి ఖర్చుల కోసం ఇవ్వాలని యూనియన్ గౌరవ అధ్యక్షుడు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
News October 8, 2025
కాకతీయుల ఆనవాళ్లకు చిహ్నం.. ఏకశిలా నగరం!

కాకతీయుల ఆనవాళ్లకు చిహ్నం ఓరుగల్లు. వారు నిర్మించిన చెరువులు, దేవాలయాలు కోకొల్లలు. వాటిలో ఒకటే ఏకశిలా నగరం. రాతి బండతో ఏర్పడిన ఈ ఏకశిలపై కోట నిర్మించడంతో ఈ పేరు వచ్చింది. దీన్ని రాజధాని రక్షణకు వ్యూహాత్మక స్థలంగా కాకతీయులు ఉపయోగించారు. పైనుంచి చుట్టుపక్క ప్రాంతాలన్నీ కనిపించేలా ఉండటంతో నిఘా కేంద్రంగా పనిచేసింది. గణపతిదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుల కాలంలో ఈ కొండ రాజభవనంలా విరాజిల్లింది.
News October 8, 2025
APPLY NOW: ఇస్రోలో 20 పోస్టులు

ఇస్రో 20 టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈ నెల 31వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఐటీఐ, డిప్లొమాతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. రాతపరీక్ష/ స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.isro.gov.in/