News October 8, 2025
వరంగల్: జడ్జిమెంట్ డే.. సర్వత్రా ఆసక్తి!

స్థానిక ఎన్నికల సంగ్రామానికి ఆరంభంలోనే ఆటుపోట్లు ఎదురవుతున్నాయి. బ్యాలెట్ పోరు పల్లెల్లో రాజుకోకముందే కోర్టు మెట్లెక్కింది. బీసీ రిజర్వ్ అంశంపై పలువురు హైకోర్టును ఆశ్రయించడంతో ఎన్నికల ప్రక్రియ కాస్త మందగించింది. హైకోర్టులో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం నేడు విచారణకు రానుండగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్థానిక ఎన్నికల్లో పోటీ చేద్దామనుకుంటున్న ఆశావహులు కోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తిగా చూస్తున్నారు.
Similar News
News October 8, 2025
ములుగు: ఈ కారు పేరు PSLV c60

వాహనాల ఓనర్లు వాటి వెనకాల రాసుకునే కొన్ని కొటేషన్లు ఫన్నీగానూ, మరికొన్ని ఆలోచింపచేసేలా ఉంటాయి. కానీ, ములుగుకు చెందిన వినయ్ తన కారుపై సందేశాత్మక అక్షరాలను చేర్చాడు. PSLV c60 అని రాసుకున్నాడు. అర్థం కాని చాలామంది గూగుల్ సెర్చ్ చేసి దాని భావం తెలుసుకొని అభినందిస్తున్నారు. మన దేశ అంతరిక్ష ప్రయోగాల విజయంలో ముఖ్య భూమిక పోషించిన రాకెట్ లాంచ్ మిషన్ ఇదే. ప్రయోగం రోజున ఈ కారు కొన్నాడట వినయ్.
News October 8, 2025
కాగజ్‌నగర్ డివిజన్‌లో చిరుతపులి సంచారం

కాగజ్‌నగర్ డివిజన్‌లోని సిర్పూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధి వేంపల్లి, ఇస్గాం అటవీ ప్రాంతాల్లో చిరుతపులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు ధ్రువీకరించారు. ఇటీవల పలు పశువులపై చిరుత దాడి చేసిన నేపథ్యంలో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అడవులకు వెళ్లే ప్రజలు ఒంటరిగా వెళ్లకూడదని, తప్పనిసరిగా గుంపులుగా వెళ్లాలని అధికారులు సూచించారు. సీసీ కెమెరాలతో ఆ ప్రాంతంలో నిఘా పెంచారు.
News October 8, 2025
అత్తిలిలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం

అత్తిలిలోని ఎన్టీ రామారావు విగ్రహం ధ్వంసమైంది. మంగళవారం రాత్రి వీచిన గాలులకు విగ్రహాన్ని ఆనుకుని ఉన్న ఫ్లెక్సీ పడిపోవడంతో ఈ ఘటన జరిగింది. తొలుత దుండగులు కూల్చివేశారనే అనుమానంతో టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించిన పోలీసులు ప్రమాదవశాత్తూ విగ్రహం ధ్వంసమైనట్లు నిర్ధారించారు.