News October 8, 2025
జూబ్లీహిల్స్ టికెట్ నవీన్ యాదవ్‌కేనా?

తాను పోటీలో లేనని బొంతు రామ్మోహన్ ప్రకటించడంతో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిత్వానికి నవీన్ యాదవ్‌కు మార్గం సుగమం అయ్యింది. బీసీ కావడం, లోకల్ లీడర్ల మద్దతుతో అధిష్ఠానం ఆయన వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. నవీన్ 2014లో MIM తరఫున 41వేల ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. 2018లో 18వేల ఓట్లతో మూడోస్థానం దక్కించుకున్నారు. 2023లో కాంగ్రెస్ విజ్ఞప్తితో పోటీ నుంచి తప్పుకుని అజాహరుద్దీన్‌కు సపోర్ట్ చేశారు.
Similar News
News October 8, 2025
హైకోర్టులో తిరిగి ప్రారంభమైన విచారణ

TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుపై హైకోర్టులో విచారణ తిరిగి ప్రారంభమైంది. రిజర్వేషన్ల అమలు జీవోను వ్యతిరేకిస్తూ రెడ్డి జాగృతి న్యాయవాది మయూర్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. కొన్ని ఇంప్లీడ్ పిటిషన్లకు నంబరింగ్ ఇవ్వలేదని మరో న్యాయవాది విచారణపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ, న్యాయ వర్గాలు చెబుతున్నాయి.
News October 8, 2025
వర్షాకాలంలోనూ సన్‌స్క్రీన్ రాసుకోవాలా?

వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉండి, మబ్బుల వల్ల సూర్యకిరణాలు తక్కువగా పడుతుంటాయి. దీంతో చాలామంది ఈ కాలంలో సన్‌స్క్రీన్ రాసుకోరు. కానీ ఇది సరికాదంటున్నారు నిపుణులు. మబ్బులున్నా కూడా సూర్యరశ్మిలోని హానికరమైన UV రేస్ భూమిని చేరుకుంటాయి. ఇవి చర్మకణాలను దెబ్బతీస్తాయి. కాబట్టి సన్‌స్క్రీన్ స్కిప్ చేయకూడదంటున్నారు. సన్‌స్క్రీన్ ఎంచుకొనేటప్పుడు Broad-spectrum , SPF50 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలని సూచించారు.
News October 8, 2025
రెండు సిరప్‌లపై ప్రభుత్వం నిషేధం

TG: రాష్ట్రంలో రెండు దగ్గు మందులను ప్రభుత్వం నిషేధించింది. Relife CF, Respifresh-TR సిరప్‌లను వాడొద్దని స్పష్టం చేసింది. ఈ రెండు దగ్గు సిరప్‌లలో అత్యంత విషపూరితమైన Diethylene Glycol (DEG) ఉందని పేర్కొంది. వీటి వాడకాన్ని తక్షణమే నిలిపివేయాలని తెలిపింది. కాగా మధ్యప్రదేశ్‌లో Coldrif సిరప్ వల్ల 20 మంది చిన్నారులు చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.