News October 8, 2025
అక్రమ లింగ నిర్ధారణ.. 4 ఆర్ఎంపీలు అరెస్టు

అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే జైలు శిక్ష తప్పదని పట్టణ సీఐ వెంకట్ అన్నారు. సూర్యాపేటలో పరీక్షలు చేస్తున్న నలుగురు ఆర్ఎంపీలను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. వారి నుంచి అల్ట్రా సౌండ్ స్కానింగ్ మెషిన్, నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.
Similar News
News March 11, 2026
విడాకులు తీసుకున్న టాలీవుడ్ హీరోయిన్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తన భర్త సోహైల్‌తో 4 ఏళ్ల వివాహ బంధానికి తెరదించారు. అతడితో విడాకుల పక్రియ ఇవాళ పూర్తయింది. తన చిన్ననాటి స్నేహితుడైన సోహైల్‌ను హన్సిక 2022లో వివాహమాడారు. అయితే అతడికి అప్పటికే రింకీ బజాన్‌తో పెళ్లి జరగ్గా కొంత కాలానికే వారిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత సోహైల్, హన్సిక లవ్ మ్యారేజీ చేసుకున్నారు.
News March 11, 2026
NGKL: విద్యుత్ సమస్యలా? ఈ నెంబర్‌కు ఫిర్యాదు చేయండి!

జిల్లాలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేదా ఇతర సమస్యలు తలెత్తితే వెంటనే కంట్రోల్ రూంకు సమాచారం అందించాలని విద్యుత్ శాఖ అధికారులు కోరారు. వేసవి దృష్ట్యా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం 8712491184 నెంబర్‌కు 24/7 సంప్రదించవచ్చని వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
News March 11, 2026
భామిని: ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏర్పాటుపై ఫీజుబులిటి టీం పరిశీలన

హైయిర్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఆదేశాల మేరకు, బామినిలో డిగ్రీ కళాశాల ఏర్పాటుపై ఫీజుబులిటీ టీం బుధవారం పరిశీలన చేసింది. డిగ్రీ కళాశాల ఏర్పాటుకు అవసరమైన స్థలం, అంశాలను రెవెన్యూ శాఖతో చర్చించారు. ఫీజుబులిటీ టీంలో పాలకొండ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ డా.ఎం. శ్యాంబాబు, సీతంపేట డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ డా. వి ప్రభాకర్ రావు, పాలకొండ డిగ్రీ కాలేజీ ఫిజిక్స్ లెక్చరర్ శ్రీనివాసరావు ఉన్నారు.


