News October 8, 2025
KNR: డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 2025- 26 విద్యాసంవత్సరానికి DMIT, DANS డిప్లొమా కోర్సులకు అర్హులైన MPC, Bi.PC అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 28లోపు కళాశాలలో అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించాలని, మరిన్ని వివరాలకు కళాశాల పోర్టల్‌ను సందర్శించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. WEBSITE: http://www.gmknr.com. SHARE IT.
Similar News
News March 19, 2026
గ్రామాల్లో ఓటర్ల జాబితా ప్రదర్శించాల్సిందే: SEC

AP: సర్పంచ్ ఎన్నికల కోసం పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితా <<19333584>>ప్రచురణకు<<>> మరో 4 వారాలు గడువు పొడిగించాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని SEC నీలం సాహ్ని తిరస్కరించారు. ఇప్పటికే 13,351 పంచాయతీల్లో ఓటర్ల మ్యాపింగ్ పూర్తయిందని ఆమె తెలిపారు. గడువు పెంపునకు సరైన కారణాలు లేవన్నారు. సాంకేతిక కారణాలతో ఎక్కడైనా జాబితా ప్రచురణ ఆలస్యమైతే పరిశీలించి తగిన ఆదేశాలిస్తామని పేర్కొన్నారు.
News March 19, 2026
అనకాపల్లి: పదో తరగతి హిందీ పరీక్షకు 62 మంది గైర్హాజర్

అనకాపల్లి జిల్లాలో బుధవారం జరిగిన పదో తరగతి హింది పరీక్షకు 62 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు డీఈవో అప్పారావు నాయుడు తెలిపారు. 102 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 20,581 మంది హాజరుకావాల్సి ఉండగా, 20,519 విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. ఎటువంటి మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పగడ్బందీగా ఏర్పాట్లు చేశామన్నారు.
News March 19, 2026
ఖమ్మం: ఉద్యోగం లేని వారికి మంచి ఛాన్స్

ఖమ్మం జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత స్వయం ఉపాధి శిక్షణ ఇవ్వనున్నట్లు DYSO సునీల్ రెడ్డి తెలిపారు. కంప్యూటర్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో 3 నెలల శిక్షణకు దరఖాస్తులు కోరుతున్నారు. ఆసక్తి గలవారు ఆధార్, విద్యార్హత పత్రాలతో నేరుగా కార్యాలయంలో సంప్రదించాలని, వివరాలకు 99482 07271 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.


