News October 8, 2025

SMలో HYD ట్రాఫిక్ అప్‌డేట్స్!

image

ట్రాఫిక్‌ నివారణ‌ కోసం మూడు కమిషనరెట్ల పోలీసులు నిత్యం వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. నిన్న రాత్రి కురిసిన వర్షానికి కూడళ్లలో వాహనాల కదలిక మందగించింది. అప్రమత్తమైన సిబ్బంది క్రమబద్ధీకరించే పనులు చేస్తూనే.. ఆఫీసులు, ఇళ్లలో ఉన్న ప్రజలకు వాస్తవ పరిస్థితిని SM ద్వారా చేరవేస్తున్నారు. ఏ రూట్‌లో ట్రాఫిక్ ఎక్కువ ఉంది?, ప్రత్యామ్నాయ రూట్‌లపై అఫిషియల్‌ అకౌంట్లలో ఫొటోలు పెట్టి సమాచారం అందిస్తున్నారు.

Similar News

News March 12, 2026

Trending: HYDలో నైట్ లైఫ్‌కు కొత్త VIBE

image

సిటీలో నైట్ సీన్ మామూలుగా లేదు బాసూ. కేవలం బిర్యానీతోనే సరిపెట్టకుండా మన GEN-Z కొరియన్ ఫుడ్, చీజ్ బర్స్ట్ స్నాక్స్ కోసం క్యూ కడుతున్నారు. రీల్స్ కోసం ‘ఫైర్’ ఐటమ్స్, క్యాన్ డెజర్ట్స్ ఇప్పుడు ట్రెండింగ్. వీకెండ్ వచ్చిందంటే చాలు.. లేట్ నైట్ డ్రైవ్స్, అదిరిపోయే డీజే మ్యూజిక్, లైవ్ గిగ్స్‌తో హైదరాబాద్ హోరెత్తిపోతోంది. అటు తిండి.. ఇటు మ్యూజిక్ కలిసి హైదరాబాద్ నైట్ లైఫ్ ఇప్పుడు నెక్స్ట్ లెవల్‌లో ఉంటోంది.

News March 12, 2026

HYD: ఫ్లై ఓవర్ కింద అద్భుతం.. స్పోర్ట్స్ అరేనా సూపర్

image

నగర యువతకు అదిరిపోయే శుభవార్త. మైదానాల కొరతతో ఆటలకు దూరమవుతున్న క్రీడా ప్రేమికుల కోసం MMC కార్పొరేషన్ ఒక అద్భుతమైన కానుకను సిద్ధం చేస్తోంది. బైరామల్‌గూడ ఫ్లైఓవర్ కింద నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాన్ని సకల వసతులతో కూడిన రంగురంగుల ‘స్పోర్ట్స్ అరేనా’గా తీర్చిదిద్దారు. పనులు చివరి దశకు చేరుకొన్నాయి. త్వరలోనే ఫ్లైఓవర్ నీడన ఆటలు ఆడుకోవచ్చు. నగరంలోని అన్ని ఫ్లై ఓవర్ల కింద ఇలా చేస్తే బాగుంటుంది. మీ కామెంట్?

News March 12, 2026

HYD: గ్యాస్ లేకపోతే ఈ ఆలోచన మీకు రాదా?

image

రూ.5కే కడుపు నింపుతున్న సంస్థలు స్టీమ్ బాయిలర్లు వాడుతుంటే.. వేలల్లో బిల్లులు వసూలు చేసే 5 స్టార్ హోటళ్లు, హాస్టళ్లు గ్యాస్ వాడుతున్నాయి. గ్యాస్ ధర పెరిగిందని కస్టమర్ల జేబులు కత్తరించే బదులు హరే రామ హరే కృష్ణ ట్రస్ట్‌ల స్టీమ్ వంట పద్ధతికి మారితే ఖర్చు తగ్గుతుంది కదా. కార్పొరేట్ హాస్టళ్లు గ్యాస్ సంక్షోభం సాకుతో మెస్ ఛార్జీలు పెంచడం కరెక్టేనా? గ్యాస్ లేకపోతే.. స్టీమ్ బాయిలర్లు ఉన్నాయి. <<19364190>>సోచో జరా!<<>>