News October 8, 2025
రైల్వే POH నిర్మాణానికి రూ.908.15 కోట్లు

MHBDలో వందేభారత్ మెగా మెయింటెన్స్ POH/ROH ఏర్పాటుకు రూ.908.15 కోట్లు విడుదల చేస్తూ రైల్వే డిప్యూటీ CME స్వరాజ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పీరియాడికల్ ఓవర్‌హోలింగ్, రెగ్యులర్ ఓవర్‌హోలింగ్, సిక్లైన్, ట్రైన్ ఎగ్జామినేషన్ వంటి కీలకమైన సదుపాయాలు రానున్నాయి. సరుకు రవాణా రైళ్లకు సంబంధించి అన్నిరకాల నిర్వహణ పనులు ఇక్కడ చేపడతారు. 300 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయనున్నారు.
Similar News
News March 13, 2026
పన్నుల వసూలులో నిర్లక్ష్యం వద్దు: జేసీ

బాపట్ల జిల్లాలో నిర్మాణ రంగ పన్నుల వసూలులో అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని జాయింట్ కలెక్టర్ భావన వశిష్ఠ శుక్రవారం ఆదేశించారు. కార్మికుల సంక్షేమ నిధికి ఈ పన్నుల ఆదాయమే కీలకమని ఆమె స్పష్టం చేశారు. అసంఘటిత రంగ కార్మికులందరికీ సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ-శ్రమ పోర్టల్‌లో ఇప్పటివరకు 1.96 లక్షల మంది కార్మికులు తమ పేర్లు నమోదు చేసుకున్నట్లు జేసీ వెల్లడించారు.
News March 13, 2026
గ్యాస్ బుక్ చేసే వారికి ఎస్పీ సూచనలు

గ్యాస్ బుకింగ్ పేరుతో సైబర్ నేరాలు జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు SP వకుల్ జిందాల్ సూచించారు. వంటగ్యాస్ సిలెండర్ల కొరత ఉందనే అపోహలను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మల్చుకొని ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. అదనపు సిలెండర్లు కేటాయిస్తామని బురిడీ కొట్టిస్తున్నారని వివరించారు. అనుమానస్పద లింకులు ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చెయ్యొద్దని సూచించారు.
News March 13, 2026
జగిత్యాల: ముగిసిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు

జగిత్యాల జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు 30 కేంద్రాల్లో నిర్వహించగా 97.55% హాజరు నమోదైంది. జనరల్ కోర్సుల్లో 5671 మందికి గాను 5571 మంది హాజరై 100 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సుల్లో 546 మందికి గాను 494 మంది హాజరై 52 మంది గైర్హాజరయ్యారు. నేటితో జనరల్ విభాగం పరీక్షలు ముగిశాయి. పరీక్షలు సరిగా రాయకపోయిన వారు మేలో జరిగే సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం కావాలని పరీక్షల కన్వీనర్ నారాయణ తెలిపారు.


