News October 8, 2025
ఉప్పాడలో పర్యటించనున్న ఉప ముఖ్యమంత్రి

ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గురువారం ఉమ్మడి తూ.గో జిల్లాలోని ఉప్పాడ రానున్నారు. మత్స్యకారుల సమస్యలను స్వయంగా పవన్ కళ్యాణ్ తెలుసుకుంటారని, కాలుష్యం జరుగుతుందని మత్స్యకారుల ఆందోళన చేస్తున్న ప్రాంతాన్ని పరిశీలించేందుకు సముద్రంపై ప్రయాణిస్తారని జిల్లా సమాచార శాఖ తెలిపింది. ఉన్నత స్థాయి అధికారుల కమిటీ ఏర్పడడం, పవన్ పర్యటనతో తమ కష్టాలు తీరుతాయని మత్స్యకారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News March 5, 2026
జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వబోం: స్పీకర్

AP: మాజీ సీఎం జగన్ మినహా YCP MLAలు అసెంబ్లీకి రాకపోయినా జీతాలు తీసుకుంటున్నారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు చెప్పారు. జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం జరగదని తేల్చిచెప్పారు. ‘గవర్నర్ ప్రసంగం రోజు సభకు హాజరైనా పరిగణనలోకి రాదు. వరుసగా 65 రోజులు గైర్హాజరైతే నోటీసులిస్తాం. ఈ విషయంపై లోక్‌సభ స్పీకర్‌ను సంప్రదిస్తా. సభకు రాని MLAలపై చర్యలు తీసుకునే చట్టాలను పార్లమెంటులోనే చేయాలి’ అని పేర్కొన్నారు.
News March 5, 2026
గద్వాల: ఇందిరమ్మ ఇళ్లకు ‘ధరల’ సెగ

గద్వాల జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై ధరల పెరుగుదల ప్రభావం తీవ్రంగా చూపుతోంది. సామాన్యుడి సొంతింటి కలపై నిర్మాణ సామగ్రి ధరలు పెనుభారంగా మారాయి. గత నెలతో పోలిస్తే మార్కెట్‌లో ధరలు ఆకాశాన్నంటాయి. ముఖ్యంగా రోబో డస్ట్ ధర యూనిట్‌కు రూ.1,100 పెరిగి రూ.4,400కు చేరింది. అలాగే నార్మల్ డస్ట్, 20 ఎంఎం కంకర ధరలు కూడా యూనిట్‌పై రూ.1,000 మేర పెరగడం గమనార్హం. ధరల సెగతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
News March 5, 2026
డ్యూటీ ముగిసిందని వెళ్లిపోయిన లోకో పైలట్.. 3 గంటలు చుక్కలు!

తన పని గంటలు ముగిశాయంటూ ట్రైన్‌ను ప్లాట్‌ఫామ్‌పై నిలిపేశారో లోకో పైలట్. దీంతో వందలాది ప్రయాణికులు 3 గంటలపాటు ఇక్కట్లు పడ్డారు. బిహార్‌లోని కిషన్ గంజ్(D) ఠాకూర్‌గంజ్ రైల్వే స్టేషన్‌లో జరిగిందీ ఘటన. మాల్డా-సిలిగురి రైలు నిన్న మధ్యాహ్నం ఠాకూర్‌గంజ్ చేరుకుంది. రూల్ ప్రకారం తన 9 గం. షిఫ్ట్ అయిపోయిందని అధికారులకు చెప్పి, రైలు నడిపేందుకు లోకో పైలట్ నిరాకరించారు. దీనిపై దర్యాప్తునకు ఆదేశించారని సమాచారం.


