News October 8, 2025

SRPT : గర్భంలోనే ఆడశిశువుకు నూరేళ్లు!

image

డబ్బుకు కక్కుర్తిపడిన కొందరు <<17944989>>గర్భంలోనే <<>>ఆడశిశువుల ప్రాణాలు తీస్తున్నారు. జిల్లాలో కొందరు RMPలు, ల్యాబ్ టెక్నీషియన్లు ముఠాగా ఏర్పడి ఈ దారుణాలకు ఒడిగడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని అమాయకులే లక్ష్యంగా రూ.12 వేలు తీసుకుని లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఆడపిల్ల అని తెలిస్తే గర్భస్రావం చేస్తున్నారు. ఈ అమానవీయ చర్యలపై అధికారులు ఉక్కుపాదం మోపాలని కోరుతున్నారు.

Similar News

News March 20, 2026

బాన్సువాడ: బస్సు కిందపడి ఒకరు మృతి

image

బాన్సువాడ ఆర్టీసీ బస్టాండ్ వద్ద గురువారం రాత్రి బస్సు కిందపడి అర్భాత్ కాలనీకి చెందిన హఫీస్ (60) అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సీఐ తుల శ్రీధర్ తెలిపారు. బస్టాండ్ ప్రాంతంలో ఆటోల రద్దీ పెరగడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News March 20, 2026

4 విడతల్లో 41 నోటిఫికేషన్లు!

image

AP: రాష్ట్ర ప్రభుత్వం నిన్న <<19422391>>జాబ్ క్యాలెండర్<<>> రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాదిలోనే 10,060 పోస్టులు భర్తీ చేస్తామంది. ఇందుకోసం 4 విడతల్లో విభాగాల వారీగా 41 నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అత్యధికంగా DSC-2,535, కానిస్టేబుల్-1,970, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్-1,500, గ్రూప్2-750, AEE-503, SI-418, ఎక్సైజ్ కానిస్టేబుల్-400, ప్లానింగ్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్-251 ఖాళీలు ఉన్నాయి.

News March 20, 2026

ఖమ్మం: బాలికపై అత్యాచారానికి ప్రయత్నించిన బాలుడు!

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలో గురువారం దారుణ ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల బాలికను 14 ఏళ్ల బాలుడు ఆడుకుందామని మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మైనర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.