News October 8, 2025
‘అనకాపల్లి-తిరుపతి ట్రైన్‌లో జనరల్ బోగీలు ఏర్పాటు చేయాలి’

అనకాపల్లి-తిరుపతి స్పెషల్ ట్రైన్‌లో సామాన్య ప్రయాణికులకు జనరల్ బోగీలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌లు వినిపిస్తున్నాయి. ప్రతి సోమవారం అనకాపల్లి నుంచి నడిచే ఈ రైల్లో అన్ని ఏసీ బోగీలో కావడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు నిరాశ పడుతున్నట్లు తెలిపారు. సామాన్య ప్రజలు ప్రయాణించే అవకాశం కల్పించాలన్నారు.
Similar News
News March 18, 2026
పెద్దపల్లి: 9 మంది విద్యార్థులు గైర్హాజరు

పెద్దపల్లి జిల్లాలో పదవ తరగతి రెండవ రోజు సెకండ్ లాంగ్వేజ్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగాయని జిల్లా విద్యాశాఖ అధికారి జి.శారద తెలిపారు. మొత్తం 7,489 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 7,480 మంది హాజరయ్యారు. 9 మంది గైర్హాజరయ్యారు. దీంతో 99.9 శాతం హాజరు నమోదైంది. పరీక్షల నిర్వహణలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని అధికారులు స్పష్టం చేశారు.
News March 18, 2026
ఇంద్రకీలాద్రిపై వైభవంగా చండీ హోమం

అమావాస్య పర్వదినం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధిలో చండీ హోమం వైభవంగా జరిగింది. కొండపై నూతనంగా నిర్మించిన యాగశాల భక్తుల విశేష ప్రశంసలు అందుకుంటోంది. ఈ క్రమంలో దాదాపు 372 మంది భక్తులు (186 జంటలు) హోమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. రద్దీ దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పకడ్బందీగా ముందస్తు చర్యలు చేపట్టారు.
News March 18, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారు వెండి ధరల వివరాలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో బుధవారం బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.15,530
*22 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ. 14,288
*వెండి 10 గ్రాముల ధర రూ.2,575


