News October 8, 2025

అనకాపల్లి: 9 స్కూల్ గేమ్స్ ఎంపిక పోటీలు

image

ఉమ్మడి విశాఖ జిల్లా అండర్-19 స్కూల్ గేమ్స్ ఎంపిక పోటీలు 9 నుంచి 19 వరకు నిర్వహించనున్నట్లు అనకాపల్లి జిల్లా ఇంటర్ అధికారి వినోద్ బాబు తెలిపారు. జిల్లాస్థాయిలో జరిగే ఎంపిక పోటీల్లో 2007 తర్వాత జన్మించిన వారు అర్హులుగా పేర్కొన్నారు. గోపాలపట్నంలో 9న బ్యాట్మెంటన్, నక్కపల్లిలో 10న హాకీ, పోటీలు జరుగుతాయన్నారు. ఉమ్మడి జిల్లాలో వివిధ చోట్ల కబడ్డీ, క్రికెట్, చెస్ వాలీబాల్ తదితర పోటీలు నిర్వహిస్తామన్నారు.

Similar News

News October 8, 2025

వేములవాడ: 24 గంటల్లో.. 20 ఆపరేషన్లు..!

image

వేములవాడ ప్రాంతీయ ఆస్పత్రిలో 24 గంటల్లో 20 రకాల ఆపరేషన్లు విజయవంతంగా పూర్తిచేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ పెంచలయ్య తెలిపారు. ఇందులో సాధారణ కాన్పులు 4, ఆపరేషన్లు 9, కంటిఆపరేషన్లు 4, జనరల్ సర్జరీలు 2, ఆర్థో ఆపరేషన్ ఒకటున్నాయి. ఆపరేషన్లు చేసిన వారిలో గైనకాలజిస్ట్ డాక్టర్లు సంధ్య, సోనీ, మాధవి, పిల్లల వైద్యులు సుభాషిణి, చారి, రమణ, ఆర్థోపెడిక్ డాక్టర్ అనిల్, అనిస్థీషియన్లు రాజశ్రీ, తిరుపతి ఉన్నారు.

News October 8, 2025

జయచంద్రారెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు: TDP

image

నకిలీ మద్యం విషయంలో TDP నుంచి సస్పెండ్ అయిన జయచంద్రారెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడని TDP ట్వీట్ చేసింది. ‘YCP హయాంలో అతని నకిలీ మద్యం దందా బాగా నడిచింది. తిరిగి 15 రోజుల క్రితమే YCP పెద్దల ఆదేశాలతో మళ్ళీ మొదలుపెట్టాడు. ఎక్సైజ్ శాఖ అప్రమత్తతో ఈ నెట్ వర్క్‌ని బయట పెట్టి అరెస్ట్‌లు చేసింది. దీని వెనుక ఉన్న YCP పెద్దలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.’అని పేర్కొంది.

News October 8, 2025

GST సవరణలతో పేదకు ఉపశమనం: కలెక్టర్

image

GST సవరణలతో పేదకు ఉపశమనం లభించిందని కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. బుధవారం చందోలు గ్రామంలో విద్యార్థులకు GST సంస్కరణలపై అవగాహన సదస్సు నిర్వహించారు. నూతన GST నిబంధనలతో పేద, మధ్యతరగతి ప్రజలు, రైతులు, విద్యార్థులకు అవసరమైన నిత్యవసరాల ధరలు తగ్గాయని వివరించారు. అనంతరం విద్యార్థులకు ఉపన్యాస పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు.