News October 8, 2025
KNRలో 35 KMల హైస్పీడ్ రోడ్డు

ఎన్‌హెచ్ 44ను లింక్ చేస్తూ హై-స్పీడ్ కారిడార్ రోడ్డు ఏర్పాటుకు ప్రభుత్వం DPRను సిద్ధం చేస్తుంది. కరీంనగర్ జిల్లాలో 35 కిలోమీటర్ల మేర 6 లేన్ రోడ్డు మార్గం అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన పలు అలైన్మెంట్స్‌పై అధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా, ఈ రోడ్డు పూర్తయితే దేశంలోని ముఖ్య నగరాలను తక్కువ సమయంలో చేరుకోవచ్చు. రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థ మరింత సులభతరం కానుంది.
Similar News
News October 8, 2025
తపాలా బిళ్లల సేకరణ ఓ మంచి అలవాటు: DFO

పోస్టల్ స్టాంపుల సేకరణ గొప్ప అలవాటని జిల్లా ఫారెస్ట్ అధికారి రామచంద్రరావు అన్నారు. బుధవారం కాకినాడ సూర్య కళా మందిరంలో జిల్లా తపాలా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫిలాటలిక్ ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శివ నాగరాజు, రామకృష్ణ తదితర పోస్టల్ శాఖ అధికారులు పాల్గొన్నారు. వివిధ రకాల స్టాంపులు సందర్శకులను ఆకట్టుకున్నాయి.
News October 8, 2025
శ్రీశైలానికి తగ్గిన వరద.. 4 గేట్లు మూసివేత

ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గడంతో బుధవారం 6 గేట్లలో 4 గేట్లను మూసివేశారు. ప్రస్తుతం 2 గేట్ల ద్వారా నాగార్జునసాగర్‌కు 55,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
మధ్యాహ్నం మూడు గంటల సమయానికి జూరాల, సుంకేసుల, హంద్రీ ప్రాజెక్టుల ద్వారా 67,120 క్యూసెక్కుల నీరు వచ్చి శ్రీశైలానికి చేరింది. దీంతో డ్యామ్ నీటిమట్టం 884.40 అడుగులకు చేరింది.
News October 8, 2025
RDT కోసం చేసిన పోరాటం ఫలించినట్లేనా?

RDTకి FCRA రెన్యువల్ కోసం కొన్ని నెలలుగా వివిధ సంఘాల నాయకులు, ప్రజలు చేస్తున్న పోరాటం ఫలించినట్లు తెలుస్తోంది. FCRA రెన్యువల్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే శుభవార్త వెలువడనున్నట్లు SAVE RDT పరిరక్షణ సమితి నాయకులు తెలిపారు. ఈ మేరకు తమకు సమాచారం అందినట్లు పేర్కొన్నారు. దీనిపై మీ కామెంట్..!