News October 8, 2025

వరంగల్: జంప్ కొడుదాం.. టికెట్ పడుదాం!

image

స్థానిక ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాలో BRS, BJPతో పాటు అధికార కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. మాజీ మంత్రులు, మాజీ MLA(BRS)లు ఇప్పటికే సమావేశాలు నిర్వహించి ఆశావహులకు దిశానిర్దేశం చేస్తున్నారు. టికెట్ ఆశించే పలువురు పార్టీలు మారుతున్నారు. అయితే, గతంతో పోలిస్తే జిల్లాలో BJP కాస్త మెరుగవడంతో పార్టీ పెద్దలను పల్లె పోరుకు సిద్ధమవుతున్న నాయకులు కలుస్తున్నారు. ఎన్నికలపై నేడు స్పష్టత రానుంది.

Similar News

News October 8, 2025

ఓట్ల చోరీ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం: మధుసూదన్ రెడ్డి

image

దేశంలో ప్రధాని మోడీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని MBNR జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి విమర్శించారు. ఓట్ల చోరీకి వ్యతిరేకంగా చేపట్టిన సంతకాల సేకరణపై జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన కోఆర్డినేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలను నాశనం చేస్తోందని, ఓట్ల చోరీ ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమని పేర్కొన్నారు.

News October 8, 2025

మన్యం జిల్లాలో పచ్చకామెర్లతో మరో ఇద్దరు మృతి!

image

కురుపాం గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు పచ్చకామెర్ల బారిన పడి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటన జరిగి వారంరోజులు గడవకముందే గుమ్మలక్ష్మిపురం మండలం బాలేసి గ్రామానికి చెందిన ఎన్.సుమన్ (పైఫోటోలో) మంగళవారం పచ్చకామెర్లతో మృతిచెందగా, జియ్యమ్మవలస మండలం చినధోడ్జి గ్రామానికి చెందిన నిమ్మక ప్రశాంత్ బుధవారం మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో గిరిజన గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

News October 8, 2025

పోలీసు సేవలు మెరుగుపరచాలి: ఎస్పీ నరసింహా

image

సూర్యాపేట: పోలీస్ స్టేషన్ల వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ నరసింహా బుధవారం 2వ పట్టణ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, పోలీసు పరికరాలు, సిబ్బంది కవాతును ఆయన పరిశీలించారు. ప్రజలకు మరింత మెరుగైన పోలీసు సేవలు అందించాలని ఈ సందర్భంగా సిబ్బందికి సూచించారు. అంతకు ముందు ఎస్పీకి డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐ వెంకటయ్య, ఎస్‌ఐలు, సిబ్బంది ఎస్పీకి గౌరవ వందనంతో స్వాగతం పలికారు.