News October 8, 2025
అప్పన్న అభరణాల లెక్కింపులో తిర’కాసు’..!

సింహాచలం దేవస్థానంలో అభరణాల లెక్కింపు ఇంకా కొలిక్కి రాలేదు. బండాగారంలో వెండి అధికంగా ఉండటం సంబంధిత రిజిస్టారులో నమోదు శాతం తక్కువగా ఉండటాన్ని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆలయ పూర్వ AEO ఆనంద్ కుమార్, ఆలయ ప్రధాన అర్చకులకు నోటీసులు జారీ చేయడం దేవస్థానంలో చర్చనీయాంశమైంది. కడపకు చెందిన ప్రభాకర ఆచారి అప్పన్న ఆలయంలో అభరణాలు మాయమయ్యాయని ఫిర్యాదుతో దేవదాయశాఖ ఐదుగురితో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది.
Similar News
News March 4, 2026
గద్వాల్: 99 రోజుల యాక్షన్ ప్లాన్

గద్వాల్ జిల్లాలో అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ పేరుతో 99 రోజుల ప్రత్యేక యాక్షన్ ప్లాన్‌ను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ప్రకటించారు. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు ఐదు దశల్లో ఈ కార్యక్రమం కొనసాగనుంది. “ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేయడమే మా ప్రధాన ఉద్దేశ్యమని తెలంగాణ ప్రగతిలో ఒక కొత్త అధ్యాయంగా నిలుస్తాయి.
News March 4, 2026
NGKL: టిప్పర్ ఢీకొని యువకుడి మృతి

బిజినేపల్లి మండలం మంగనూరులో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన చింతకాయల లక్ష్మణ్ (26) అనే యువకుడు మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. వృత్తిరీత్యా దిండిలోని ఒక పెట్రోల్ బంకులో పనిచేస్తున్న లక్ష్మణ్, విధి నిర్వహణ ముగించుకుని బైకుపై ఇంటికి వస్తుండగా టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు.
News March 4, 2026
నిర్మల్: నేటి నుంచి సదరం వైద్య శిబిరాలు

నిర్మల్ జిల్లాలో బుధవారం నుంచి ఈనెల 31వ తేదీ వరకు సదరం వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు డీఆర్‌డీఓ విజయలక్ష్మి తెలిపారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్తోతో పాటు ఇతర విభాగాల దివ్యాంగులకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ముందుగా స్లాట్ బుక్ చేసుకుని, మొబైల్‌కు సమాచారం వచ్చిన వారు మాత్రమే ఈ శిబిరాలకు హాజరుకావాలని సూచించారు. అర్హులైన దివ్యాంగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.


