News October 8, 2025

నీటిలో TDS స్థాయులను చెక్ చేస్తున్నారా?

image

ప్రస్తుతం చాలామంది మినరల్ లేదా ప్యూరిఫయర్ ద్వారా శుద్ధి చేసిన నీటిని తాగుతున్నారు. అయితే సరైన TDS స్థాయులున్న నీటినే తాగాలని వైద్యులు చెబుతున్నారు. TDS గరిష్ఠంగా 500 mg/L మాత్రమే ఉండాలని BIS చెబుతుంటే WHO 300 కంటే తక్కువ ఉంటే బెస్ట్, 300-600 మధ్యలో ఉంటే మంచివంటోంది. అయితే ప్యూరిఫయర్లు నీటిలోని TDS స్థాయులను నియంత్రించగలవు. ఇవి 50 కంటే తక్కువ చేస్తే అందులో ముఖ్యమైన ఖనిజాలను కోల్పోవచ్చు. SHARE IT

Similar News

News April 1, 2026

పన్ను బకాయిలపై వడ్డీ మాఫీ గడువు పొడిగింపు

image

AP: మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తి పన్ను బకాయిలపై 50% వడ్డీ మాఫీ గడువును ఈనెల 30 వరకు GOVT పొడిగించింది. ఈ స్కీమ్ ప్రకటించాక 14 రోజుల పనిదినాలే ఉండటంతో వినియోగించుకోలేకపోయామని వినియోగదారుల నుంచి అభ్యర్థనలు రావడంతో గడువును పొడిగిస్తూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ ఉత్తర్వులిచ్చారు. ట్యాక్స్ వసూళ్లపై దృష్టి పెట్టాలని, మున్సిపాల్టీల ఆర్థిక స్థితిని మెరుగుపరచాలని కమిషనర్లను ఆదేశించారు.

News April 1, 2026

ఈ వార్తలూ చదవండి..

image

⬇ కేజీబీవీ దరఖాస్తు గడువు 10 వరకు పొడిగింపు
⬇ గంగూలీ బయోపిక్ షురూ.. టైటిల్ ఇదే
⬇ పక్షి పిల్లకు 50 మంది సెక్యూరిటీ.. స్పెషాలిటీ ఇదే
⬇ పండు వెన్నెల్లో రాములోరి కళ్యాణం.. ఎందుకంటే?
⬇ LIVE ACCIDENT: బస్సు బీభత్సం
⬇ ‘ఆయా షేర్’.. నాని ఊర మాస్ లుక్!
⬇ అమరావతిపై చర్చ.. కూటమి Vs YCP(VIDEO)
⬇ IPL: ఇది గమనించారా?

News April 1, 2026

భారీగా పెరిగిన బంగారం ధర.. కారణం ఇదే

image

పశ్చిమాసియాలో ఘర్షణలు తగ్గొచ్చనే అంచనాలు, బ్యాంకులు వడ్డీ రేట్లను సవరించవనే నమ్మకంతో బంగారం, వెండికి డిమాండ్ పెరిగింది. దీంతో మళ్లీ ధరలు పెరుగుతున్నాయి. ఇవాళ రెండుసార్లు రేట్లు ఎగిశాయి. HYD బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ఏకంగా ₹3,440 పెరిగి ₹1,52,950 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹3,150 పెరిగి ₹1,40,200కు చేరింది. ఇక కేజీ వెండి ధర ₹2,65,000గా ఉంది.