News October 8, 2025

కోడేరులో అత్యధిక వర్షపాతం

image

నాగర్ కర్నూల్ జిల్లాలో గడచిన 24 గంటలలో నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు బుధవారం వెల్లడించారు. జిల్లాలో కోడేరు మండలంలోనే అత్యధికంగా 32.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాగర్ కర్నూల్‌లో 21.3, కల్వకుర్తిలో 14.0, తిమ్మాజీపేటలో 12.3, బల్మూరులో 11.3, పెద్దకొత్తపల్లిలో 11.0, వెల్దండలో 8.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.

Similar News

News October 8, 2025

NZB: డిప్లొమా పరీక్షల ఫలితాలు విడుదల

image

నిజామాబాద్‌లోని సుభాష్ నగర్ శ్రీ జ్ఞాన సరస్వతి సంగీత నృత్య పాఠశాలలో జూన్ నెలలో జరిగిన సర్టిఫికేట్ డిప్లొమా పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయని ప్రిన్సిపల్ రవీందర్ రాజు తెలిపారు. వివిధ విభాగాల్లో 93 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 68 మంది ఉత్తీర్ణులయ్యారని వెల్లడించారు. ఫెయిల్ అయిన విద్యార్థులు సంబంధిత పత్రాలతో రుసుము చెల్లించి జనవరిలో జరిగే పరీక్షలకు హజరు కావాలని సూచించారు.

News October 8, 2025

సయోధ్య సరే.. మంత్రుల మధ్య గ్రూపుల సంగతేంటి?

image

మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మధ్య సయోధ్య సరే గాని, మంత్రుల మధ్య ఉన్న గ్రూప్ రాజకీయాల సంగతేంటని కాంగ్రెస్ శ్రేణులు అధిష్ఠానాన్ని ప్రశ్నిస్తున్నాయి. అంతర్గత విభేదాలను పరిష్కరించకుంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తీవ్ర నష్టం ఖాయమంటున్నాయి. అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించి నేతలను ఏకతాటి పైకి తీసుకువచ్చి గ్రూపు రాజకీయాలకు స్వస్తి పలికేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి.

News October 8, 2025

నరేంద్రపురం గురుకుల పాఠశాలను సందర్శించిన జిల్లా మలేరియా అధికారి

image

పి గన్నవరం మండలంలోని నరేంద్రపురం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను కోనసీమ జిల్లా మలేరియా అధికారి వెంకటేశ్వర్రావు బుధవారం సందర్శించారు. గురుకుల పాఠశాల, కళాశాలల వద్ద బాలుర వసతి గృహాల వద్ద దోమల వ్యాప్తి ఉండకుండా నివారణ చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. పరిసరాల పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలన్నారు.