News October 8, 2025
జగన్ కాన్వాయ్‌లో ఈ షరతులు తప్పనిసరి: పోలీసులు

➤ కాన్వాయ్‌తో ర్యాలీలు, రోడ్ మార్చ్‌లు నిషేధం
➤ Z+ భద్రతా నిబంధనల ప్రకారం ఎస్కార్ట్, పైలట్, బ్యాకప్ వాహనాలతో సహా మొత్తం 10వాహనాలకు మించకూడదు
➤ కాన్వాయ్ వెళ్తున్న సమయంలో ఇతర వాహనాలు చేరకూడదు
➤ కార్యక్రమం ప్రారంభానికి కనీసం 24 గంటల ముందు వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్, డ్రైవర్ పేరు, కాంటాక్ట్ నంబర్ ట్రాఫిక్ ACPకి సమర్పించాలి
ఈ షరతులను ఉల్లంఘించినట్లైతే <<17944917>>అనుమతి<<>> రద్దు చేస్తామని పోలీసులు తెలిపారు.
Similar News
News October 8, 2025
NZB: డిప్లొమా పరీక్షల ఫలితాలు విడుదల

నిజామాబాద్‌లోని సుభాష్ నగర్ శ్రీ జ్ఞాన సరస్వతి సంగీత నృత్య పాఠశాలలో జూన్ నెలలో జరిగిన సర్టిఫికేట్ డిప్లొమా పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయని ప్రిన్సిపల్ రవీందర్ రాజు తెలిపారు. వివిధ విభాగాల్లో 93 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 68 మంది ఉత్తీర్ణులయ్యారని వెల్లడించారు. ఫెయిల్ అయిన విద్యార్థులు సంబంధిత పత్రాలతో రుసుము చెల్లించి జనవరిలో జరిగే పరీక్షలకు హజరు కావాలని సూచించారు.
News October 8, 2025
సయోధ్య సరే.. మంత్రుల మధ్య గ్రూపుల సంగతేంటి?

మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మధ్య సయోధ్య సరే గాని, మంత్రుల మధ్య ఉన్న గ్రూప్ రాజకీయాల సంగతేంటని కాంగ్రెస్ శ్రేణులు అధిష్ఠానాన్ని ప్రశ్నిస్తున్నాయి. అంతర్గత విభేదాలను పరిష్కరించకుంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తీవ్ర నష్టం ఖాయమంటున్నాయి. అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించి నేతలను ఏకతాటి పైకి తీసుకువచ్చి గ్రూపు రాజకీయాలకు స్వస్తి పలికేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి.
News October 8, 2025
నరేంద్రపురం గురుకుల పాఠశాలను సందర్శించిన జిల్లా మలేరియా అధికారి

పి గన్నవరం మండలంలోని నరేంద్రపురం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను కోనసీమ జిల్లా మలేరియా అధికారి వెంకటేశ్వర్రావు బుధవారం సందర్శించారు. గురుకుల పాఠశాల, కళాశాలల వద్ద బాలుర వసతి గృహాల వద్ద దోమల వ్యాప్తి ఉండకుండా నివారణ చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. పరిసరాల పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలన్నారు.