News April 7, 2024

తవణంపల్లెలో 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

image

చిత్తూరు జిల్లాలోని తవణంపల్లె మండలంలో శనివారం అత్యధికంగా 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పులిచెర్లలో 43.6, ఎస్ఆర్ పురం 42.9, విజయపురం, నగరి, నిండ్ర 42.8,పుంగనూరు, బంగారుపాళ్యం 41.5,సోమల 41.4,చిత్తూరు, సదుం 41.2,పాలసముద్రం, గుడిపల్లె 41,కుప్పం 40.9,చౌడేపల్లె, యాదమరి,రొంపిచెర్ల, ఐరాల 40.8, జీడీనెల్లూరు, వెదురుకుప్పం 40.7,కార్వేటినగరం 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Similar News

News October 3, 2025

తిరుపతి MP ఫిర్యాదుపై జాతీయ SC కమిషన్ స్పందన

image

దేవరంపేట గ్రామంలో అంబేడ్కర్ విగ్రహాన్ని దహనం చేసిన ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తిరుపతి ఎంపీ గురుమూర్తి ఫిర్యాదు చేసిన 2 గంటలలోపే కమిషన్ సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది. చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు 30 రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ నివేదికలో FIR వివరాలు, నమోదు చేసిన సెక్షన్లు అరెస్టుల సమాచారం ఇవ్వాల్సినట్లు స్పష్టం చేసింది.

News October 3, 2025

చిత్తూరు ఎస్పీ ఆధ్వర్యంలో ఆయుధపూజ

image

చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ ఆధ్వర్యంలో ఏఆర్ పరేడ్ గ్రౌండ్‌లో గురువారం ఆయుధపూజ నిర్వహించారు. ఆయుధ కారాగారం, పోలీసు క్యాంటీన్, జిమ్, పోలీసు అసోసియేషన్ ఆఫీస్, అడ్మిన్ కార్యాలయాలలోనూ పూజలు చేశారు. ప్రజల రక్షణకై పోలీసు సిబ్బంది తుపాకులను క్రమశిక్షణతో వాడుతుందని ఎస్పీ తెలిపారు. చెడుపై మంచి విజయం సాధించడానికి విజయదశమి ప్రతీక అన్నారు.

News October 2, 2025

తమిళ పోలీసులను సర్వీస్ నుంచి తొలగింపు

image

చిత్తూరు జిల్లాకు చెందిన మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ తిరువన్నామలై ఈస్ట్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్స్ సుందర్, సురేశ్ రాజ్‌లను పోలీస్ సర్వీస్ నుంచి తొలగిస్తూ ఎస్పీ సుధాకర్ ఉత్తర్వులు జారీ చేశారు. మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్‌ను ఇప్పటికే అరెస్టు చేసి వేలూరు జైలులో రిమాండ్‌కు తరలించారు. ఇనపద్దంలో ఇద్దరు కానిస్టేబుళ్లను విధుల నుంచి తొలగిస్తూ SP ఉత్తర్వులు జారీ చేశారు.