News October 8, 2025
చాహల్ రిలేషన్.. మరోసారి అలా చేయను: ధనశ్రీ

క్రికెటర్ చాహల్‌తో రిలేషన్‌పై మాజీ భార్య ధనశ్రీ వర్మ మరోసారి కామెంట్ చేశారు. ‘నా పార్ట్నర్ తప్పు చేశాడని తెలిసినా సపోర్ట్ చేశాను. అందుకు తర్వాత పశ్చాత్తాపం చెందా. మళ్లీ అలా చేయాలి అనుకోవట్లేదు’ అని ఆమె స్పష్టం చేశారు. బిగ్‌బాస్ తరహా రియాల్టీ షో ‘రైజ్ అండ్ ఫాల్’లో ఉన్న శ్రీ.. హౌజ్‌మేట్ నిక్కీతో విభేదాలపై మరొకరితో చెబుతూ ఇలా అన్నారు. కాగా ‘2 నెలల్లోనే దొరికిపోయాడు’ అని ఇదే షోలో ఇటీవల కామెంట్ చేశారు.
Similar News
News October 8, 2025
ఆలిండియా రేడియో తొలి తెలుగు మహిళా న్యూస్‌రీడర్

ఆలిండియా రేడియో తొలి తెలుగు మహిళా న్యూస్‌రీడర్ జోలెపాళ్యం మంగమ్మ 1925 సెప్టెంబర్12న మదనపల్లెలో జన్మించారు. ఈమె MA,BEd, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. 1960లో AIRలో చేరి న్యూస్‌రీడర్‌గా, ఎడిటర్‌గా పనిచేశారు. కేంద్రసమాచారశాఖ, విదేశాంగశాఖల్లో కీలక పదవులు చేపట్టారు. ఈమెకు ENG, ఫ్రెంచ్, ఎస్పరాంటో, తమిళ, హిందీభాషల్లో ప్రావీణ్యం ఉంది.<<-se>>#firstwomen<<>>
News October 8, 2025
మరిన్ని కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి కసరత్తు

TG: కొత్తగా మరిన్ని ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులకు అనుమతి రాగా నిజామాబాద్, మహబూబ్ నగర్, పెద్దపల్లి ప్రాంతాల్లో విమానాశ్రయాల నిర్మాణానికి AAI, IAF అప్రూవల్ కోసం ప్రయత్నిస్తోంది. అటు గతంలో సాయిల్ టెస్టులో ఫెయిలైన కొత్తగూడెం దగ్గర అనువైన భూమి వెతికే పనిలో ఉన్నట్లు అధికార వర్గాలు వే2న్యూస్‌కు తెలిపాయి.
News October 8, 2025
నోబెల్.. ఆరేళ్లుగా ఎదురు చూపులే!

మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ రంగాల్లో గొప్ప ఆవిష్కరణలకు గానూ ఈ ఏడాది కూడా పలువురిని <<17948685>>నోబెల్ బహుమతులు<<>> వరించాయి. కానీ వారిలో ఒక్కరూ భారతీయులు, భారత సంతతి శాస్త్రవేత్తలు లేకపోవడం సగటు భారతీయుడిని నిరాశకు గురి చేస్తోంది. 2019లో చివరిసారి భారత మూలాలున్న అభిజిత్ బెనర్జీకి ఎకానమిక్స్‌లో నోబెల్ వచ్చింది. దేశంలో ఆవిష్కరణలకు కొదువ లేకున్నా నోబెల్ స్థాయికి అవి వెళ్లలేకపోతుండటం ఆలోచించాల్సిన విషయం.