News October 8, 2025

NLG: వరుస వర్షాలతో తెల్ల బంగారానికి తెగుళ్లు!

image

జూన్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు జిల్లాలో సాధారణ వర్షం 526.6 మిల్లీమీటర్లు కాగా 670.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అతివృష్టి కారణంగా జిల్లాలో రైతులు సాగు చేసిన వరి పత్తి పంటలు చాలావరకు దెబ్బతిన్నాయి. పత్తి ఏరే సమయంలో గత రెండు మూడు రోజుల నుంచి జిల్లా అంతటా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పత్తి చేలు ఎర్ర భారీ తెగుళ్ల బారిన పడ్డాయి.

Similar News

News October 9, 2025

NLG: ట్రైనింగ్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

image

నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో GNM (జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ) శిక్షణ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. 2025-26 సంవత్సరానికి గాను అర్హతగల యువతీ, యువకులు ఈ నెల 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు జిల్లా వైద్యాధికారులను లేదా dme.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చన్నారు.

News October 9, 2025

నల్గొండ: నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ

image

నల్గొండ జిల్లాలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నల్గొండ, దేవరకొండ డివిజన్లలో గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి తెలిపారు. 18 జడ్పీటీసీ, 197 ఎంపీటీసీ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయని స్పష్టం చేశారు. ప్రతీ రోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తామని పేర్కొన్నారు.

News October 9, 2025

NLG: నేటి నుంచే లతీఫ్ షా వలి ఉర్సు ఉత్సవాలు

image

నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రసిద్ధి చెందిన హజరత్ సయ్యద్ లతీఫ్ షా వలి ఉర్సు ఉత్సవాలు గురువారం నుంచి వైభవంగా మొదలవుతున్నాయి. 3 రోజుల పాటు అధికారికంగా జరిగే ఈ వేడుకలకు దర్గాను ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. నేడు సాయంత్రం జరిగే గంధం ఊరేగింపులో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్, ఎస్పీ సహా పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు.