News October 8, 2025
ములుగు: దళ కమాండర్‌ను హతమార్చిన మావోయిస్టులు?

ఈనెల 2న ఏటూరునాగారం మండలం చెల్పాక అటవీ ప్రాంతంలో లభించిన గుర్తు తెలియని మృతదేహం మావోయిస్టు దళ కమాండర్ లక్కీదని తెలుస్తోంది. దసరా రోజు చెల్పాక అటవీ ప్రాంతంలో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా నక్సల్స్ హతమార్చినట్లు సమాచారం. ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలోని ఓ ఏరియా దళ కమాండర్‌గా పనిచేస్తున్న మాడవి లక్కీని హతమార్చినట్లు స్థానికులకు మావోయిస్టులు చెప్పినట్లు సమాచారం. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Similar News
News March 27, 2026
బ్లాక్ మార్కెటింగ్ నిరోధానికి చర్యలు.. మోదీతో రేవంత్

TGలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరా, బ్లాక్ మార్కెటింగ్ నిరోధానికి CS ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసినట్లు PM మోదీ టెలికాన్ఫరెన్స్‌లో CM రేవంత్ తెలిపారు. ప్రతి బంక్‌లో స్టాక్, విక్రయాలపై ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించామని, 100% రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయించామన్నారు. ఇకపై RTCలో ఈవీ బస్సులే వాడతామని PM దృష్టికి తీసుకెళ్లారు.
News March 27, 2026
పెద్దాపురంలో ఫ్లెక్సీల కలకలం.. ఆ ఇద్దరిలో ఎమ్మెల్యే ఎవరు?

పెద్దాపురం మహారాణి సత్రం వద్ద ఈవో శ్రీనివాస్ ఏర్పాటు చేసిన శ్రీరామనవమి ఫ్లెక్సీలు చర్చనీయాంశమయ్యాయి. ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కుమారుడు రంగనాగ్ ఫోటోను వేసి, ఆయనను ఏకంగా ‘ఎమ్మెల్యే’గా పేర్కొనడం గందరగోళానికి దారితీసింది. నేతల మెప్పుకోసమే ఈవో ఇలాంటి తప్పులు చేశారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకేచోట తండ్రీకొడుకులను ఎమ్మెల్యేలుగా చూపిస్తూ ఫ్లెక్సీలు పెట్టడంపై స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.
News March 27, 2026
స్వచ్ఛాంధ్ర సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని శనివారం విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం సంబంధించిన అధికారులతో ఆమె టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. “జీరో వేస్ట్ ఇన్స్టిట్యూట్” నినాదంతో ఈ నెల స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అధికారులు గ్రామ స్థాయి నుంచి కార్యక్రమాలను నిర్వహించాలని పరిసరాలు పరిశుభ్రతకు శ్రద్ధ వహించాలన్నారు.


