News October 8, 2025
జుట్టు రాలిపోతోందా? ఇవి మీ డైట్‌లో ఉంటే..!

చాలామందికి యుక్త వయసులోనే జుట్టు రాలిపోతుండటం ఆందోళనకరం. జుట్టు బలంగా ఉండేందుకు ఎన్ని షాంపులు, నూనెలు వాడినా శరీరానికి పోషకాలు అందడం ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. రోజూ గుమ్మడి గింజలు తింటే జుట్టు కుదుళ్లు బలంగా మారుతాయని సూచిస్తున్నారు. వీటిల్లో జింక్, మెగ్నీషియం, కుకుర్బిటాసిన్ అమైనో యాసిడ్స్‌తో పాటు సహజ నూనెలు DHT హార్మోన్‌ను అడ్డుకొని జుట్టు రాలడాన్ని నిరోధించి వృద్ధికి తోడ్పడతాయట.
Similar News
News October 8, 2025
బీసీ రిజర్వేషన్లపై విచారణ వాయిదా

TG: BC రిజర్వేషన్ల బిల్లుపై విచారణ రేపు మ.2.15 గం.కు వాయిదా పడింది. మరికొన్ని వాదనలను AG రేపు వినిపిస్తామని పేర్కొన్నారు. నామినేషన్లు వేయకుండా స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరగా హైకోర్టు నిరాకరించింది. ఈ నేపథ్యంలో BC రిజర్వేషన్ల బిల్లుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అటు కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వని నేపథ్యంలో రేపు ఉదయం ఫేజ్-1 నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది.
News October 8, 2025
₹1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు SIPB గ్రీన్ సిగ్నల్

AP: రాష్ట్రంలో ₹1.14లక్షల కోట్ల పెట్టుబడులకు స్టేట్ ఇన్వెస్ట్‌మెంటు ప్రమోషన్ బోర్డ్ (SIPB) ఆమోదం తెలిపింది. ఐటీ, ఇంధన, టూరిజం, ఏరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో 30కి పైగా ప్రాజెక్టులు ఏర్పాటుకానున్నాయి. రేడియంట్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ సంస్థ ₹87,520కోట్ల పెట్టుబడి పెడుతోందని, గతంలో ఈస్థాయిలో రాలేదని అధికారులు పేర్కొన్నారు. ఈ ఇన్వెస్టుమెంట్స్‌ను రప్పించిన లోకేశ్‌ను సమావేశంలో మంత్రులు అభినందించారు.
News October 8, 2025
అష్టాంగ నమస్కారం అంటే ఏంటి? ఎలా చేయాలి?

8 అంగములతో చేసేదాన్ని అష్టాంగ నమస్కారం అంటారు. దీన్నే సాష్టాంగ నమస్కారం అని కూడా పిలుస్తారు. ఇందులో ఉపయోగించే 8 అంగాలు ఇవే..
1. ఉరసా(తొడలు), 2. శిరసా(తల)
3. దృష్ట్యా(కళ్లు), 4. మనసా(హృదయం)
5. వచసా(నోరు), 6. పద్భ్యాం(పాదాలు)
7. కరాభ్యాం(చేతులు), 8. కర్ణాభ్యాం(చెవులు) అని అర్థం.
<<-se>>#Sankhya<<>>