News October 8, 2025
PDPL: అప్పులు తాళలేక యువకుడి ఆత్మహత్య

PDPL(D) శ్రీరాంపూర్ మండలం పెగడపల్లికి చెందిన గోపగోని అజయ్‌కుమార్(26) గౌడ్ మద్యానికి బానిసై అప్పులు చేసి, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో ఈనెల 4న గడ్డిమందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కుటుంబ సభ్యులు సుల్తానాబాద్, అనంతరం కరీంనగర్లోని పలు ఆస్పత్రులకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీలో ఉంచారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News March 13, 2026
ఫ్లాష్ ఫ్లడ్స్‌ను 24hrs ముందే అంచనా వేయొచ్చు: పిచాయ్

పట్టణాల్లో ఆకస్మిక వరదలను 24hrs ముందే అంచనా వేసే ‘గ్రౌండ్ సోర్స్’ అనే కొత్త AI మోడల్‌ను రూపొందించినట్లు గూగుల్ CEO సుందర్ పిచాయ్ ప్రకటించారు. ‘జెమినీ’ సాయంతో ఇది 150+ దేశాల్లో 26లక్షల వరద సంఘటనలను విశ్లేషించిందని తెలిపారు. శాస్త్రవేత్తల పరిశోధనలు, ప్రజల సేఫ్టీ కోసం ఈ డేటాను గూగుల్ <
News March 13, 2026
మధిర: హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

మధిర రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో ఒడిశా రాష్ట్రానికి చెందిన శిభా భిషోయ్(29)కు జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా విధిస్తూ సత్తుపల్లి 6వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎం.శ్రీనివాస్ గురువారం తీర్పు వెల్లడించారు. 2025 జూన్ 8న కొదుమూరు రోడ్ నిర్మాణ పనుల వద్ద సుమంత్ కుమార్ పండేను ఇనుపరాడుతో దాడి చేసి హత్య చేసినట్లు నిరూపితమైంది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులను సీపీ అభినందించారు.
News March 13, 2026
భద్రాద్రి: లొంగిపోయిన మావోయిస్టులకు రివార్డు

భద్రాద్రి జిల్లా పోలీసుల ఎదుట ఇటీవల 27 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వివిధ క్యాడర్లో పనిచేస్తూ లొంగిపోయిన మావోయిస్టు సభ్యులకు గురువారం రూ.62,50,0000 విలువ గల చెక్కులను ఎస్పీ రోహిత్ రాజు, అడిషనల్ ఎస్పీ నరేందర్ అందజేశారు. కాలం చెల్లిన సిద్ధాంతాలతో స్వార్థ ప్రయోజనాలతో మావోయిస్టు నాయకులు అమాయక ఆదివాసీలను బలవంతంగా పార్టీలో చేర్చుకుని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేలా చేస్తున్నారని చెప్పారు.


