News October 8, 2025
మోదీకి కంగ్రాట్స్ చెప్పిన జగన్

ప్రధాని మోదీ ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వైసీపీ చీఫ్ జగన్ ఆయనకు అభినందనలు తెలిపారు. ‘ఈ మైలురాయి దేశసేవ పట్ల మీ అంకితభావం, పట్టుదల, నిబద్ధతను తెలియజేస్తోంది. మీరు ఇలాగే పని చేస్తూ విజయాలు సాధించాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు.
Similar News
News October 8, 2025
AP న్యూస్ అప్డేట్స్

* అమరావతిలో CRDA ప్రాజెక్టు కార్యాలయాన్ని ఈనెల 13న 9.54AMకు ప్రారంభించనున్న CM చంద్రబాబు
* లిక్కర్ స్కాం కేసు: MP మిథున్ రెడ్డి పాస్‌పోర్ట్ తిరిగి ఇవ్వాలని సిట్‌కు ACB కోర్టు ఆదేశం.. US జనరల్ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లేందుకు పాస్‌పోర్ట్ ఇప్పించాలని కోరిన MP
* 21 మందితో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ సలహా కమిటీని నియమించిన ప్రభుత్వం
* రాష్ట్రంలో 274 రోడ్ల మరమ్మతులకు రూ.1,000 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
News October 8, 2025
PCOSకి చెక్ పెట్టే చియా సీడ్స్

ప్రస్తుతకాలంలో చాలామందిని బాధించే సమస్య PCOS. దీనివల్ల బరువు పెరగడం, పీరియడ్స్ సరిగా రాకపోవడంలాంటి ఎన్నో సమస్యలు వస్తాయి. అయితే PCOSకి చియాసీడ్స్ పరిష్కారం చూపుతాయంటున్నారు నిపుణులు. వీటిలో పీచు అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియను నెమ్మది చేసి, చక్కెర శోషణను తగ్గిస్తాయి. దీనివల్ల రక్తంలో షుగర్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి. ఇది ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తుంది. బరువును తగ్గిస్తుంది.
News October 8, 2025
చియా సీడ్స్ ఎలా తీసుకోవాలంటే?

చియా సీడ్స్ చూడడానికి చిన్నగా ఉన్నా, పోషకాలు మాత్రం చాలా ఎక్కువ. వీటిని నీటిలో లేదా పాలల్లో కొన్నిగంటలు నానబెట్టి స్మూతీస్, చియా పుడ్డింగ్‌లో కలుపుకోవచ్చు. సలాడ్స్, సూప్స్‌పై చల్లుకొని తీసుకోవచ్చు. బేక్ చేసిన పదార్థాలలో కూడా వీటిని కలపొచ్చు. షుగర్, బీపీ సమస్యలు ఉన్నవారు, లేదా ఏవైనా మందులు వాడుతున్నవారు చియా సీడ్స్‌ను తమ ఆహారంలో చేర్చుకునే ముందు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి.