News October 8, 2025

కామారెడ్డి జిల్లాలో కేంద్ర బృందం పర్యటన..

image

కామారెడ్డి జిల్లా వరద నష్టాన్ని అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర బృందానికి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ స్వాగతం పలికారు. ఈ బృందం బిక్నూర్ మండల కేంద్రంలోని ముఖ్య ప్రాంతాలను పరిశీలించింది. ముఖ్యంగా, భారీ వరదలకు కోతకు గురైన దాస్నమ్మకుంట వద్ద రోడ్డును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇతర ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేయనున్నారు. వరద నష్ట తీవ్రతను ఈ బృందం కేంద్రానికి నివేదించనుంది.

Similar News

News March 22, 2026

‘వాట్సాప్’ల్లోనే అమ్మాయిల వివరాలు: నెల్లూరు ASP

image

నెల్లూరులో <<19448814>>వ్యభిచార<<>> ఘటనపై ASP దీక్ష మాట్లాడారు. ‘గతవారమే మాకు సమాచారం వచ్చింది. చిన్నబజార్‌లోని నాలుగు లాడ్జిల్లో సోదాలు చేశాం. లాడ్జి ఓనర్లు అమ్మాయిలను HYD, బెంగళూరు నుంచి రప్పించి వారి ఫొటో, రేట్ నిర్ణయించి కస్టమర్‌కు వాట్సాప్ చేస్తారు. దీంతో ఇవాళ మా టీమ్‌తో దాడులు చేశాం. ఓ అమ్మాయితో నలుగురు విద్యార్థులు ఉండగా పట్టుకున్నాం. ఈ ఘటనలో 27 ఫోన్లు సీజ్ చేశాం. కేసు నమోదు చేస్తాం’ అని ASP తెలిపారు.

News March 22, 2026

ఖాతాల్లోకి డబ్బులు.. 3 రోజులే ఛాన్స్

image

TG: రైతుభరోసా పథకం డబ్బులు పొందాలంటే మార్చి 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 28 వరకు కొత్తగా పట్టాదారు పాస్ బుక్ పొందిన రైతులు, ఇప్పటివరకు రైతుభరోసా పొందని, బ్యాంక్ వివరాలు నమోదు చేయని వారు అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు. అప్లికేషన్ ఫామ్‌తో పాటు పాస్ బుక్, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్, మొబైల్ నంబర్ వివరాలు సమర్పించాలి. పూర్తి వివరాలకు AEOలను సంప్రదించాలి.

News March 22, 2026

గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్‌‌లో పాక్ టాప్

image

ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్థాన్.. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్‌లో ఈసారి అగ్రస్థానంలో నిలిచింది. 2025లో ఉగ్రదాడులతో నమోదైన మరణాలు 6% పెరిగి 1,139కు చేరాయి. 2013 తర్వాత ఈ స్థాయిలో మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. పొరుగుదేశాలు.. ముఖ్యంగా అఫ్గాన్‌తో టెన్షన్స్.. TTP, BLA సంస్థల దాడులు ఇందుకు కారణాలని రిపోర్ట్ తెలిపింది. కాగా గత ఏడాది ఈ ఇండెక్స్‌లో బుర్కినో ఫాసో, పాక్ తొలి 2 స్థానాల్లో ఉన్నాయి.